బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 6 ఏప్రియల్ 2018 (09:29 IST)

స్టెఫానీ క్లిఫోర్డ్‌తో సంబంధాలా? ''నో'' అన్న ట్రంప్.. లాయర్ డబ్బులిచ్చాడా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ పేమెంట్‌పై రెండు నెలల మౌనాన్ని వీడారు. పదేళ్ల క్రితం పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్‌తో ట్రంప్ శృంగార కార్యకలాపాలు సాగించారని.. ఈ వ్యవహారం బయటపడకుండా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోర్న్ స్టార్ పేమెంట్‌పై రెండు నెలల మౌనాన్ని వీడారు. పదేళ్ల క్రితం పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్‌తో ట్రంప్ శృంగార కార్యకలాపాలు సాగించారని.. ఈ వ్యవహారం బయటపడకుండా వుండేందుకు 1.30 లక్షల డాలర్లు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై.. ట్రంప్ ''నో'' అంటూ కామెంట్ చేశారు. 
 
మరోవైపు స్టార్మీ డేనియల్స్ పేరుతో తెరపై కనిపించే పోర్న్ స్టార్ స్టెఫానీ క్లిఫోర్డ్ తనకు ట్రంప్‌తో సంబంధాలున్నాయని.. దశాబ్దం క్రితం ఇద్దరి మధ్య జరిగిన శృంగార కార్యకలాపాలను బయటపెట్టకుండా నోరు మూసేందుకు ఆయన 1.30 లక్షల డాలర్ల సొమ్మును తన లాయర్ ద్వారా పంపారని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలు అమెరికాలో పెను సంచలనం సృష్టించింది.
 
స్టెఫానీ క్లిఫోర్డ్ వ్యాఖ్యలపై రెండు నెలల పాటు నోరెత్తని ట్రంప్ ప్రస్తుతం నో అని చెప్పారు. కానీ క్లిఫోర్డ్‌కు తాను డబ్బులు చెల్లించిన మాట నిజమేనని.. ట్రంప్ వద్ద సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న లాయర్ మైఖెల్ కోహెన్ అంగీకరించారు. అయితే ఆ సొమ్మును ఎందుకు ఇచ్చారనే విషయాన్ని వెల్లడించలేదు. కానీ మైఖెల్ క్లిఫోర్డ్‌కు డబ్బులిచ్చిన సంగతి తనకు తెలియదని ట్రంప్ చెప్పారు.