శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 24 ఫిబ్రవరి 2022 (10:45 IST)

బయటకు రావొద్దు, బాంబులు పడుతున్నాయ్: ఉక్రెయిన్‌లో అత్యవసర పరిస్థితి

రష్యా నుంచి ముప్పు పెరుగుతుండటం ఒకవైపు, ప్రపంచంలోని ఏ దేశం ఉక్రెయిన్ కు మద్దతు ఇచ్చినా ఊరుకోబోమని పుతిన్ హెచ్చరిక మరోవైపు. దీనితో ఉక్రెయిన్ అధ్యక్షుడు శాంతి కోసం వేడుకుంటున్నారు.

 
తన శాంతి వచనాలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించరని చెప్పారు ఉక్రెయిన్ అధ్యక్షుడు అన్నారు. బుధవారం అర్థరాత్రి దేశాన్ని ఉద్దేశించి ఉద్వేగభరితమైన ప్రసంగంలో, ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తన దేశం రష్యాకు ముప్పు కలిగిస్తుందని మాస్కో చేస్తున్న వాదనల్లో నిజం లేదని తిరస్కరించారు.

 
ఉక్రెయిన్ పైన రష్యా దండయాత్ర వల్ల వేలమంది అమాయక ప్రజల ప్రాణాలు పోతాయని విలపించారు.
 ఉక్రెయిన్ ప్రజలు, ఉక్రెయిన్ ప్రభుత్వం శాంతిని కోరుకుంటుందని దేశవ్యాప్త అత్యవసర పరిస్థితిని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత రష్యా దాడి ప్రారంభించింది. ఐతే తమ దేశంపైన దాడి కొనసాగితే తాము ఎదురుదాడి చేస్తామని పుతిన్‌ను హెచ్చరించారు.