శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (09:39 IST)

గిన్నిస్‌ రికార్డులో వివాహ గౌను

పెళ్లి గౌనుపై టోపీ వస్త్రం అత్యంత పొడవైనదిగా గిన్నీస్‌ రికార్డులకెక్కింది. ఆ గౌను పై వస్త్రం 962.6 కిలోమీటర్ల పొడవు. ఆమె సైప్రస్‌కు చెందిన మరియా పరాస్కేవా.

ఆమె వివాహ గౌను టోపీ వస్త్రం అత్యంత పొడవైనదిగా ధరించి గిన్నిస్‌ బుక్‌ రికార్డుకెక్కాలని తన చిన్ననాటి కల అని మరియా అన్నారు. ఇలా రికార్డుకెక్కడానికి మైదానంలో 30 మంది వాలంటీర్లు, ఆరు గంటలపాటు శ్రమించారని ఆమె తెలిపింది.

ఈ వీడియోను సోషల్‌ మీడియాలో పోస్టు చేసిన ఐదు గంటల్లోనే నెటిజన్లు 25 వేల లైకులు కొట్టగా.. మరెంతోమంది నెటిజన్లు ఈ వీడియోను వీక్షించారు.

అందులో కొంతమంది ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోతుండగా.. మరికొంతమందేమో ఇదెలా సాధ్యం అంటూ ప్రశ్నిస్తున్నారు. మరికొంతమందేమో.. వావ్‌ అని అన్నారు.