కిమ్ భార్య ఎక్కడ.. కనిపించట్లేదే.. ఏమైంది?
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ను చూస్తే అమాయకుడిలా కనిపిస్తాడు. అనుమానం వస్తే చాలు ఎలా ప్రవర్తిస్తాడో అందరికి తెలిసిందే. తన నీడనే తాను నమ్మడు. ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచుతాడు. కరోనాకు ముందు నిత్యం సంచలన విషయాలతో వార్తల్లో నిలిచే కిమ్ ఇటీవల కాలంలో పెద్దగా వార్తల్లో కనిపించడం లేదు.
తాజాగా, ఏడాది కాలంగా కిమ్ భార్య రి సోల్ జు కనిపించడం లేదు. కనీసం మీడియాలో కూడా ఆమెకు సంబంధించిన వార్తలు రావడం లేదు. దీంతో అనేక అనుమానాలు తలెత్తాయి.
అనారోగ్యం కారణంగా బయటకు రావడం లేదని కొందరు అంటుంటే, మరికొందరి వాదన మరోలా ఉంది. బయట కరోనా ఉన్న కారణంగా కిమ్ ఆదేశాల మేరకు ఆమె బయటకు రావడం లేదని అంటున్నారు.