స్కూల్ మూసి వేస్తారనీ గొర్రెలకు అడ్మిషన్లు.. ఎక్కడ?
ప్రతిచోటా పాఠశాలలకు వెళ్లే చిన్నారుల సంఖ్య తగ్గిపోతోంది. దీంతో అనేక పాఠశాలలు మూసివేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉన్నాయి. అలాగే, మధ్యలో స్కూల్ మానేస్తున్న వారి సంఖ్య (డ్రాపౌట్స్) కూడా ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఒకటి రెండు పాఠశాలలను కలిపి ఒకే స్కూలుగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. దీంతో స్కూల్‌ను వేస్తారనే ప్రచారం జరిగింది. దీంతో పాఠశాల యాజమాన్యానికి అద్భుతమైన ఆలోచన వచ్చిందే తడవుగా గొర్రెలకు అడ్మిషన్లు కల్పించారు. ఈ విచిత్ర సంఘటన ఫ్రాన్స్‌లోని అల్ఫ్స్ ప్రాంతం, కేట్స్ ఎన్ బెల్లెడోన్నె అనే గ్రామంలో జరిగింది.
ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ గ్రామంలో ఓ పాఠశాల ఉంది. ఇందులో ఒకటి నుంచి 11వ తరగతి వరకు క్లాసులు ఉన్నాయి. వీటిలో ఒక క్లాసులో విద్యార్థుల సంఖ్య నానాటికీ తగ్గిపోతోంది. దీంతో ఆ తరగతిని మూసి వేయాలని స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. అలా చేస్తే వారి విద్యాసంవత్సరం వేస్ట్ అవుతుంది. ఇది తెలిసిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. తరగతిని మూసివేయకుండా ఉండేందుకు వీలుగా ఓ ఆలోచన చేశారు.
తరగతితో విద్యార్థుల సంఖ్య తగ్గకుండా ఉండేందుకు 15 గొర్రెలకు పేర్లు పెట్టి.. వాటిని ఆ క్లాసులోకి అడ్మిషన్స్ ఇప్పించారు. అంతేకాదు గొర్రెల జననధృవీకరణ పత్రాన్ని(బర్త్ సర్టిఫికెట్) చూపించి మరీ పేర్లు రిజిస్టర్ చేయించారు. ఈ వింత నిరసనతో ఎట్టకేలకు తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పిల్లల సంఖ్యపైకాకుండా.. వారి సంక్షేమం మీద శ్రద్ధ పెట్టాలని చురకలు అంటించారు. వాట్ యాన్ ఐడియా కదూ..!