గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 8 ఫిబ్రవరి 2020 (15:50 IST)

ఒంటరిగా వున్న యువతి.. బలవంతంగా ముద్దు పెట్టబోతే.. కరోనా కాపాడింది.. ఎలా?

corona Virus
చైనాలో కరోనా వైరస్ కారణంగా 600మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారితో చైనా ప్రజలు వణికిపోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా కరోనాతో భయం భయంగా గడుపుతున్నాయి. అయితే ఈ చైనా కరోనా వైరస్ ప్రపంచ ప్రజలను బలితీసుకుంటుంటే.. ఆ వైరస్ కారణంగా ఓ యువతి ప్రాణాలతో బయటపడింది. చైనాలో గత ఏడాది డిసెంబర్ నుంచి వందలాది మందిని కరోనా వైరస్ బలిగొంటోంది. 
 
కానీ కరోనా వైరస్ కారణంగా ఓ యువతి పెద్ద ప్రమాదం నుంచి తప్పుకుంది. వివరాల్లోకి వెళితే.. చైనా వుహాన్ నగరానికి సమీపంలోని జింగ్‌షాయ్ అనే నగరంలో ఓ యువతి ఒంటరిగా జీవనం గడుపుతోంది. ఆమె ఇంట్లోకి ఓ యువకుడు చొరబడ్డాడు. అంతేగాకుండా ఆమెను బలాత్కారం చేయబోయాడు. ఇంకా ఆమెను బలవంతంగా ముద్దు పెట్టుకునేందుకు ప్రయత్నించాడు. 
 
కానీ ఇంతలో అతని చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆ యువతి బుద్ధికి పదునుపెట్టింది. దగ్గు, జ్వరం, జలుబు వున్నట్లు నటించింది. చాలాసేపు అలానే దగ్గుతూ వుండిపోయింది. అంతేగాకుండా తనకు కరోనా వుందని అబద్ధం చెప్పింది. 
 
కరోనా కారణంగానే తాను ఒంటరిగా వున్నట్లు అతడితో తెలిపింది. ఈ విషయం విన్న ఆ యువకుడు ఆ యువతి గృహం నుంచి పారిపోయాడు. ఆపై ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో యువకుడిని పోలీసులు అరెస్ట్ చేసి.. కేసును దర్యాప్తు జరుపుతున్నారు.