మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఫిబ్రవరి 2022 (22:09 IST)

ఉజ్బెకిస్తాన్‌లో షాకింగ్ ఘటన : మూడేళ్ల చిన్నారిని జూలో విసిరేసింది..?

సోషల్ మీడియాలో పుణ్యమాని ఎక్కడ ఏం జరిగినా నిమిషాల్లో నెట్టింట్లో తెలిసిపోతుంది. తాజాగా ఓ భయానక ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసినవారంతా షాక్ అవుతున్నారు. 
 
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన మూడేళ్ల చిన్నారిని తష్కెంత్ జూలోని జంతువుల దగ్గరకు విసిరేసింది. 16అడుగుల ఎత్తు నుంచి ఎలుగుబంటి దగ్గరకు విసిరేయడంతో ఆ చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి.
 
అదృష్టవశాత్తు చిన్నారికి గాయాలతో మాత్రమే బయటపడింది. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యింది. కానీ ఆ మహిళ ఆ చిన్నారిని ఎందుకు విసిరేసిందోననే విషయం ఇంకా తెలియరాలేదు.