గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : సోమవారం, 31 జనవరి 2022 (19:57 IST)

వదినపై సొంతమరిది లైంగికదాడి.. పది మంది రౌడీలతో వచ్చి..?

హైదరాబాద్ మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. వదినపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. అక్కడితో ఆగకుండా సొంత వదినపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. 
 
వివరాల్లోకి వెళితే.. కుషాయి గూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సంపూర్ణ అనే మహిళ తన ఏడాదిన్నర చిన్నారి, మరో మహిళతో కలిసి నివాసం ఉంటోంది. 
 
అయితే.. రాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో సొంత మరిది వేణుగోపాల్‌ పీకల దాకా తాగి పదిమంది రౌడీలను వెంట తీసుకొచ్చాడు. ఆమె ఇంటి తలుపులు బద్దలు కొట్లాడు. ఆమెపై దాడి చేశాడు. అలాగే లైంగిక దాడికి పాల్పడ్డాడు.
 
దీంతో ఆ మహిళ కేకలు, చిన్నారి ఏడుపు విన్న స్థానికులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని.. మహిళపై దాడులకు పాల్పడుతున్న వ్యక్తులను పట్టుకోడానికి ప్రయత్నించారు. 
 
కానీ వారు అక్కడి నుంచి ఎంతో చాకచక్యంగా తప్పించుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు  నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.