సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 31 జనవరి 2022 (19:16 IST)

పెగ్ ఫ్రెండ్, ఇంటికి తీసుకొస్తే భార్యతో లింకు పెట్టుకున్నాడు

వయస్సును పట్టించుకోలేదు. తనకంటే రెట్టింపు వయసున్న మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. వయస్సులో చిన్నవాడైనా నమ్మి ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టినందుకు ఆమెను లొంగదీసుకున్నాడు. ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్ళి వేరే ప్రాంతంలో కాపురమే పెట్టాడు. చివరకు..

 
విశాఖపట్నం ఎండాడ ప్రాంతంలో నివాసముంటున్నారు శ్రీనివాసరావు, రాజమ్మ. శ్రీనివాసరావు రెవిన్యూ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యాడు. కూతురుకు పెళ్ళి చేశాడు. భార్యాభర్తలు మాత్రమే ప్రస్తుతం కలిసి ఉంటున్నారు. శ్రీనివాసరావు కల్లు తాగే అలవాటు చేసుకున్నాడు. ప్రతిరోజూ పూటుగా మద్యం సేవించి ఇంటికి వస్తుండేవాడు.

 
ఈ క్రమంలో లక్ష్మణ్ అనే 26 యేళ్ళ వ్యక్తి అతడికి పరిచయమయ్యాడు. ఇది కాస్త స్నేహంగా మారింది. తాగిన తరువాత లక్ష్మణ్‌ను శ్రీనివాసరావు అతని ఇంటికి తీసుకెళ్ళాడు. ఈ క్రమంలో రాజమ్మకు దగ్గరయ్యాడు లక్ష్మణ్. ఆమెను లోబరుచుకున్నాడు. సహజీవనం చేద్దామని తన ఇంటికి తీసుకెళ్లాడు.

 
దీంతో శ్రీనివాసరావు ఆగ్రహంతో ఊగిపోతూ లక్ష్మణ్‌తో గొడవకు దిగాడు. వీరి పంచాయతీ కాస్త పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. రాజమ్మ మాత్రం తను లక్ష్మణ్ తోనే ఉంటానని చెబుతోంది.