Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా.. అగ్రరాజ్యమే టాప్

Written By సెల్వి
Updated: శనివారం, 30 మే 2020 (10:25 IST)
ప్రపంచ దేశాలను కరోనా వణికిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కేసులు సంఖ్య 60లక్షలకు చేరుకున్నాయి. అగ్రదేశం అమెరికాలో కోవిడ్ ప్రభావం ఏమాత్రం తగ్గడంలేదు. దేశంలో మృతుల సంఖ్య 1లక్షల 3వేలకు చేరుకుంది. ఇక మొత్తం కేసులు 17లక్షల 70వేలకు పైగా నమోదయ్యాయి. ప్రపంచంలో అత్యధిక కేసులు అమెరికాలోనే నమోదయ్యాయి. 4లక్షల 98వేలమంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
ఇక బ్రెజిల్లో పరిస్థితి మరి దయనీయంగా మారింది. దేశంలో కేసులు సంఖ్య 4లక్షల 38వేలు దాటాయి. మృతుల సంఖ్య 26వేలకు చేరుకున్నాయి. 1లక్ష 93వేల మంది వైరస్ బారినుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రష్యాలో మృతుల సంఖ్య కంట్రోల్‌లో ఉన్నా… పాజిటివ్ కేసులు సంఖ్య 3లక్షల 87వేలు దాటాయి. ప్రతిరోజు వేలల్లో కేసులునమోదవుతున్నాయి. 
 
స్పెయిన్‌లో కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. దేశంలో 2లక్షల 84వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక ఇటలీలో కరోనా విస్తృతి కొనసాగుతోంది. ఇప్పటివరకు 33వేల మంది వైరస్ బారిన పడి మరణించారు. 2లక్షల 31వేల మందికి వైరస్ సోకింది.

అన్నీ చూడండి

నెమ్మదించిన కెరీర్ - పెళ్లి పీటలెక్కనున్న బుట్టబొమ్మ

గ్లామర్ అంటే జీరో సైజ్ శరీరాకృతి మాత్రమేనా? బాలీవుడ్ నటి అంజలి ఆనంద్ ప్రశ్న

తెలంగాణ అంటే తాగడం - ఆంధ్రా అంటే తిండి అనడం తప్పు : నటుడు నరేశ్

Rocking Star Yash: రాకింగ్ స్టార్ యష్.. టాక్సిక్' ట్రైలర్ ఆగస్టు 8న రిలీజ్

Manasa Chowdary : లవ్ జాతర నుంచి మానస చౌదరి బర్త్ డే పోస్టర్

తర్వాతి కథనం
Show comments