Dharma Sangrah

రజనీకాంత్ 'జైలర్ 2' చిత్రీకరణ పూర్తి

Written By ఠాగూర్
Updated: గురువారం, 2 జులై 2026 (11:23 IST)
సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం జైలర్-2. ఈ చిత్రం చిత్రీకరణ పనులు పూర్తి చేసుకుంది. నెలన్స్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ భారీ నిర్మాణ వ్యయంతో నిర్మించింది.
 
తాజాగా 'జైలర్‌ 2' షూటింగ్‌ పూర్తయినట్లు టీమ్ తెలిపింది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. నిజానికి ఈ సినిమా చిత్రీకరణ ఈ ఏడాది ఏప్రిల్‌లోనే పూర్తయింది. కానీ, నెల్సన్‌ ఈ కథలో మరికొన్ని కొత్త సన్నివేశాలు యాడ్‌ చేసి 25 రోజుల పాటు మళ్లీ షూటింగ్‌ నిర్వహించారు. తాజాగా అవి కూడా పూర్తయినట్లు చిత్రబృందం పేర్కొంది.
 
ఈ చిత్రంలో హృతిక్‌ రోషన్‌ అతిథి పాత్రలో నటిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆయన చెన్నై రావడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ 25 రోజుల షెడ్యూల్‌లో ఆయనకు సంబంధించిన సన్నివేశాలనే చిత్రీకరించారని సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
'జైలర్‌'లో పలు భాషలకు చెందిన అగ్రతారలు అతిథి పాత్రల్లో మెరిసిన విషయం తెలిసిందే. రెండో భాగంలోనూ ఆ సందడి కొనసాగనుంది. సీనియర్‌ నటుడు మిథున్‌ చక్రవర్తి కూడా ఇందులో కీలకపాత్రలో కనిపించనున్నారు. మొదటి భాగం ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచే సీక్వెల్‌ ప్రారంభమవుతుందని గతంలో శివరాజ్ కుమార్‌ తెలిపారు.
About Author
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... Read More

అన్నీ చూడండి

SIR Shock: ప్రముఖులకు షాకిచ్చిన సర్‌.. ఆ జాబితాలో రాజమౌళి, సమంత, మహేష్

నన్ను అంతం చేయడానికి ప్లాన్.. జోగి ఫ్యామిలీతో ప్రాణహాని.. గవర్నర్‌ను ఆశ్రయించిన కోడలు

కుమార్తె పెళ్లి... వైఎస్ జగన్‌ను షర్మిల ఆహ్వానిస్తారా?

భార్యపై అత్యాచారయత్నం.. కాపాడబోయిన భర్తకు ఏమైందంటే?

పెట్రోల్ బంకులోకి దూసుకొచ్చిన బస్సు: తప్పు బస్సు డ్రైవరుది కాదు, ఇద్దరు సోంబేరులది, వీడియో

అన్నీ చూడండి

చిన్ననాటి టీకాలతో ఆగిపోకూడదు, అన్ని వయసుల్లో వ్యాక్సినేషన్ అవసరం

ఆరోగ్యం తేడా వచ్చి ఆస్పత్రులకు వెళితే గుంజేస్తాయి, అందుకే DatesMilk

నెఫ్రోప్లస్ NIDA, నెఫ్రోప్లస్ అంతర్జాతీయ డయాలిసిస్ అకాడమీ ప్రారంభం

salt lemon water, గోరువెచ్చని నిమ్మరసంలో ఉప్పు కలిపి తాగితే?

ఈ సమస్యలున్నవారు దానిమ్మ కాయలు తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments