శనివారం, 30 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (09:34 IST)

ఆల్‌రౌండర్ వాట్సన్ అవసరమయ్యే గేల్‌ను తప్పించాం.. తప్పేంటి: ఆర్సీబీ హెడ్ కోచ్ వెటోరి

వరుస పరాజయాలతో ప్రేక్షకుల అంచనాలను ఘోరంగా తప్పించిన ఆర్సీబీ జట్టులోంచి కీలక ఆటగాడిని పక్కన పెట్టడంతో ఇంకా విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. విమర్శలకు చెక్ పెట్టాలనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు హెడ్‌ కోచ్‌

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కీలక ఆటగాడు క్రిస్ గేల్‌నే ఆటనుంచి తప్పించడం ద్వారా ఐపీఎల్‌లో చెలరేగిన ప్రకంపనలు ఇంకా సద్దు మణగలేదు. వరుస పరాజయాలతో ప్రేక్షకుల అంచనాలను ఘోరంగా తప్పించిన ఆర్సీబీ జట్టులోంచి కీలక ఆటగాడిని పక్కన పెట్టడంతో ఇంకా విమర్శలు చెలరేగుతూనే ఉన్నాయి. విమర్శలకు చెక్ పెట్టాలనే రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు హెడ్‌ కోచ్‌ డేనియల్‌ వెటోరీ రంగంలోకి దిగాడు. గేల్ తప్పిస్తూ తీసుకున్న నిర్ణయం జట్టును మరింత సమతుల్యంలో పెట్టడానికేనని సమర్ధించుకున్నాడు.
 
ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ముగిశాక ఒక బౌలర్‌ కొరత ఉందని స్పష్టమైందని, జట్టు అవసరాల రీత్యా షేన్‌ వాట్సన్‌ ఆల్‌రౌండర్‌గా సరిపోతాడని భావించామని వెటోరీ పేర్కొన్నాడు. దీంతో గేల్‌ స్థానంలో వాట్సన్‌ను కొనసాగిస్తున్నామని తెలిపాడు. విధ్వంసక ఓపెనర్‌ క్రిస్‌ గేల్‌ను జట్టు నుంచి తప్పించడం సమంజసమేనని వెటోరీ వ్యాఖ్యానించాడు. అయితే ఆదివారం రైజింగ్‌ పుణే సూపర్‌ జెయింట్‌తో జరిగిన మ్యాచ్‌లో వాట్సన్‌ ఘోరంగా విఫలమయ్యాడు. దీంతో పుణే చేతిలో బెంగళూరు ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 
 
ఇలా ఆడితే కప్ కాదు కదా చిప్ప కూడా చేతికి దొరకదంటూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్ర అసహనం ప్రకటించిన నేపథ్యంలో చివరి ఓవర్లలో ధారళంగా తమ బౌలర్లు పరుగులు సమర్పించుకోవడంపై వెటోరి ఆందోళన వ్యక్తం చేశాడు. దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు తమ సొంతమైదానం చిన్నస్వామి స్టేడియం బౌలర్లకు సహకరించగలదని వెటోరీ అశాభావం వ్యక్తం చేశాడు.