గురువారం, 28 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2017
Written By Raju
Last Updated :హైదరాబాద్ , సోమవారం, 22 మే 2017 (09:07 IST)

పుణే యాజమాన్యాన్ని గేలిచేస్తున్న ఉప్పల్ ప్రేక్షకులు.. బ్యాటింగ్‌కు వచ్చిన ధోనీకి ప్రేక్షకుల నీరాజనం

ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ ఆటలో 12వ ఓవర్లో 44 వ్యక్తిగత స్కోర్ వద్ద మిచెల్ జాన్సస్ బౌలింగులో పోలార్డ్ పట్టిన అద్భుత క్యాచ్‌కు అజింక్యా రహానే ఔట్ అయిన తర

ఆదివారం రాత్రి ఉప్పల్ స్టేడియంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఐపీఎల్ ఫైనల్ ఆటలో 12వ ఓవర్లో 44 వ్యక్తిగత స్కోర్ వద్ద  మిచెల్ జాన్సస్ బౌలింగులో పోలార్డ్ పట్టిన  అద్భుత క్యాచ్‌కు అజింక్యా రహానే ఔట్ అయిన తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీకి ఉప్పల్ స్టేడియం స్టాండిగ్ ఒవేషన్‌తో స్వాగతం పలికింది. ధోనీ యు ఆర్ ది బెస్ట్ అంటూ ప్రేక్షకులు లేచి నిలబడి మరీ ప్లకార్డులతో తమ ఆదరాన్ని చాటుకున్నారు. పుణే సూపర్ జెయింట్స్ ఎంత అవమానిస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఐపీఎల్ 10 సీజన్‌లో ప్రతి మైదానంలోనూ ధోనీ వేపే నిలిచారు. మొత్తం స్టేడియం తనకు మద్దతుగా నిలిచి హర్షధ్వానాలు చేస్తున్న చలించని స్థిత ప్రజ్ఞతతో ధోని క్రీజులో కెప్టెన్‌కు చేదోడువాదోడుగా ఆడుతున్నాడు.
 
16 ఓవర్లలో 97 పరుగుల స్కోరు వద్ద స్మిత్ 32 పరుగులు, దోనీ 12 పరుగుల వద్ద ఆడుతున్నారు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు మందగించాయి. నాలుగు ఓవర్లో 33 పరుగులు చేయాల్సిన తరుణంలో పుణె జట్టు కాస్త టెన్షన్‌లో పడింది. కానీ స్మిత్, ధోనీ చివరివరకు నిలిస్తే గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు.
 

కెప్టెన్‌గా తనపై నమ్మకం ఉంచిన మేనేజ్‌మెంట్‌కు ట్రోఫీ విజయాన్ని కానుకగా అందించాలని స్టీవ్‌ స్మిత్‌ పట్టుదలగా ఆడుతున్నాడు. పుణె అసాధారణ ప్రదర్శనలో కెప్టెన్‌ స్మిత్‌తో పాటు ధోని పాత్ర కూడా చాలా ఉంది. ఐపీఎల్‌లో తను అనుభవాన్నంతా ఉపయోగించి అతను కీలక సమయాల్లో స్మిత్‌కు అండగా నిలిచాడు. మేనేజ్‌మెంట్‌ ఆలోచనలు ఎలా ఉన్నా... బ్యాట్స్‌మన్‌గా, కీపర్‌గా అతని అంకిత భావంలో ఎలాంటి లోపం లేకుండా చక్కటి ప్రదర్శన కనబర్చాడు. స్మిత్‌కు ఇప్పుడు మరో మ్యాచ్‌లో ఆ అవసరం ఉంది. ఏడో ఐపీఎల్‌ ఫైనల్‌ ఆడబోతున్న ధోని, స్మిత్‌తో కలిసి జట్టును నడిపిస్తే పుణెకు తిరుగుండదు. ఫైనల్లో ఇప్పుడు మైదానంలో నిలకడగా ఆడుతున్న స్మిత్, ధోనీ ద్వయం గెలుపు ముంగిట ఆ చారిత్రక క్షణాలను ఆస్వాదించే దిశగా సాగుతోంది.