Webdunia - Bharat's app for daily news and videos

Install App

శునకంతో డ్రెస్సింగ్ రూమ్ మొత్తం కలియతిరిగిన ధోనీ..

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులు, శునకాలంటే చాలా ఇష్టం. శునకాలతో ఆడుకోవడం, బైక్ రేసులకు వెళ్ళడంపై ఎంతో ఆసక్తి చూపే ధోనీ.. తాజాగా 2013లో దత్తత తీసుకున్న ఓ శునకాన్ని పట్టుకుని డ్రెస్స

Written By selvi
Updated: సోమవారం, 7 మే 2018 (15:25 IST)
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బైకులు, శునకాలంటే చాలా ఇష్టం. శునకాలతో ఆడుకోవడం, బైక్ రేసులకు వెళ్ళడంపై ఎంతో ఆసక్తి చూపే ధోనీ.. తాజాగా 2013లో దత్తత తీసుకున్న ఓ శునకాన్ని పట్టుకుని డ్రెస్సింగ్‌ రూమ్‌ మొత్తం కలియతిరిగాడు. ఇంకా తన ఫ్రెండ్ వచ్చిందంటూ అందరికీ పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. 
 
మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన సెక్యూరిటీ డాగ్ గోల్డెన్ అయిన రిట్రీవర్‌తో కలిసి ధోనీ కలియతిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ధోనీ ఐపీఎల్‌లో ఆడుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం పాలుకావడం పట్ల చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అసహనం వ్యక్తం చేశాడు.
 
బౌలింగ్, ఫీల్డింగ్ రంగాల్లో ఆటగాళ్లు విఫలం కావడం పట్ల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇంకా, ఫీల్డింగ్ పొరపాట్లపై ధోనీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆటగాళ్లు ఈ ఓటమిపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించాడు. బౌలర్లు సరైన ప్రదర్శన చేయకపోతే, వారిని తరచుగా మార్చాల్సి ఉంటుందని చెప్పాడు. 

అన్నీ చూడండి

హైదరాబాదులో ఏఐఎంఐఎం కార్యకర్త దారుణ హత్య.. ఇంట్లోనే కత్తులతో..?

పెన్ డ్రైవ్‌లో బాలికతో పారిశ్రామికవేత్త లైంగిక కోర్కెలు తీర్చుకుంటున్న దృశ్యాలు

తిరుపతి: కొండను ఢీకొన్న లారీ.. అగ్నికి ఆహుతి.. డ్రైవర్‌కు ఏమైందంటే?

హైదరాబాద్ రోడ్లపై గుంతలు.. రోడ్డుపై కూర్చున్న వ్యక్తి.. బాగు చేసే వరకు కదలను

ప్రేమ విఫలం.. ఆత్మహత్యకు పాల్పడిన కానిస్టేబుల్.. ఎక్కడ?

అన్నీ చూడండి

గుడ్ టైం మూవీ తో అందరికీ గుడ్ టైం రాబోతుందన్న ప్రముఖులు

OG 2 Latest update :పవన్ కళ్యాణ్ ఓజీ 2 గురించి తాజా అప్‌డేట్

Raja Singh: ఫ్యామిలీతో చూసే సినిమా తీయండని యశ్‌కు రాజాసింగ్ విజ్ఞప్తి

Vijay Deverakonda: ఆయన పిలిచాక రాకుంటే నేను బతికి ఎందుకు?.. విజయ్ దేవరకొండ ఎమోషనల్

Gautam: గౌతమ్ ఘట్టమనేని కు కుటుంబసభ్యులు, ఫౌండేసన్ శుభాకాంక్షలు

తర్వాతి కథనం
Show comments