ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ 2018
Written By selvi
Last Updated : గురువారం, 12 ఏప్రియల్ 2018 (18:29 IST)

బాలీవుడ్ హీరోయిన్‌ ప్రేమలో డ్వేన్ బ్రావో.. కాఫీ షాపులో?

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, విండీస్ జట్టు మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో... బాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడని జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ నటి, మిస్ ఇండియా నటాషా స

కాసుల వర్షం కురిపించే ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు, విండీస్ జట్టు మాజీ కెప్టెన్ డ్వేన్ బ్రావో... బాలీవుడ్ హీరోయిన్ ప్రేమలో పడ్డాడని జోరుగా ప్రచారం సాగుతోంది. బాలీవుడ్ నటి, మిస్ ఇండియా నటాషా సూరితో బ్రావో లవ్వాయణం సాగిస్తున్నట్లు సమాచారం. వీరిద్ద‌రూ ముంబైలోని ఓ కాఫీ షాప్‌లో న‌వ్వుతూ మాట్లాడుకుంటూ మీడియా కంటపడ్డారు. 
 
అలాగే బ్రావోతో దిగిన ఫోటోల‌ను న‌టాషా త‌న సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది. అయితే బ్రావోకు, నటాషాకు దాదాపు పదేళ్ల నుంచి పరిచయం వుందని.. ఆ పరిచయంతోనే వీరిద్దరూ ముంబైలో ఐపీఎల్ సందర్భంగా కలిశారని బిటౌన్ జనం అంటున్నారు.
 
కానీ బ్రావో తన భార్యకు విడాకులిచ్చేశాడని, నటాషాతో బ్రావో ప్రేమాయణం సాగిస్తున్నాడని సినీ జనం అంటున్నారు. కానీ వారిద్దరూ స్నేహితులేనని.. వారి మధ్య ప్రేమాయణం నడవట్లేదని సినీ జనం అంటున్నారు.