సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపిఎల్ 2021
Written By సెల్వి
Last Updated : గురువారం, 30 సెప్టెంబరు 2021 (15:06 IST)

సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టిన బంగ్లాదేశ్ క్రికెటర్ రెహ్మాన్- వీడియో వైరల్

Mustafizur Rahman
రాజస్థాన్ రాయల్స్ స్టార్ పేసర్, బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ తన సూపర్ ఫీల్డింగ్‌తో అదరగొట్టాడు. సూపర్ మ్యాన్‌లా తన ఫీల్డింగ్ ఫీట్‌తో ఔరా అనిపించాడు. రాయల్ చాలెంజర్స్ బెంగుళూరుతో బుధవారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 7 వికెట్లతో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అయితే రాజస్థాన్ ఓడినా ఈ మ్యాచ్‌లో ముస్తాఫిజుర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. 
 
బౌలింగ్‌లో రెండు వికెట్లు తీసిన అతను బౌండరీ లైన్ వద్ద తన మైమరిపించే ఫీల్డింగ్‌తో సిక్స్‌ను కాస్త సింగిల్‌గా మార్చాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టంట వైరల్‌గా మారింది. ముస్తాఫిజుర్ సూపర్ ఫీల్డింగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. వాటే ఫీల్డింగ్.. వాటే ఫిట్‌నెస్ అంటూ నోరెళ్ల బెడుతున్నారు.