మంగళవారం, 26 నవంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 25 మార్చి 2022 (13:06 IST)

ఐపీఎల్ 2022 పివ్యూ: తొలి పోరుకు చెన్నై సిద్ధం.. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నా..?

ఐపీఎల్ 2022కు స‌ర్వం సిద్ధ‌మైంది. ఈ నెల 26 నుంచి మే 29 వ‌ర‌కు క్రికెట్ అభిమానుల‌ను అల‌రించ‌నున్న ఈ లీగ్‌లో 10 జ‌ట్లు త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకోనున్నాయి. ముంబైలోని నాలుగు వేదిక‌ల‌లోనే మొత్తం లీగ్ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు. 
 
ప్లేఆఫ్ మ్యాచ్‌ల‌ను అహ్మ‌దాబాద్‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. లీగ్ మ్యాచ్‌లు, ప్లేఆఫ్ మ్యాచ్‌లు క‌లిపి ఐపీఎల్ 2022లో మొత్తం 74 మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. మ‌హారాష్ట్రలోని వాంఖ‌డే, డీవై పాటిల్, బ్రబోర్న్ స్టేడియాల్లో 55 లీగ్ మ్యాచులు జరుగనుండగా.. పూణెలోని ఎంసీఎ గ్రౌండ్‌లో 15 లీగ్‌ మ్యాచులు జర‌గ‌నున్నాయి. 
 
ఇక ఈ నెల 26న జ‌ర‌గనున్న తొలి మ్యాచ్‌లో గ‌త సీజ‌న్లో ఫైన‌ల్ చేరిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, చెన్నైసూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డనున్నాయి. కాగా గ‌త 3 సీజ‌న్ల మాదిరిగానే ఈ సారి కూడా క‌రోనా కార‌ణంగా ఐపీఎల్‌కు సంబంధించిన ఓపెనింగ్ సెర్మ‌నీ వేడుకుల‌ను నిర్వ‌హించ‌డం లేదు.
 
కానీ ఐపీఎల్ మ్యాచ్‌ల‌ను వీక్షించ‌డానికి స్టేడియాల్లోకి ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తిస్తున్న‌ట్లు బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించింది. అయితే క‌రోనా దృష్యా 25శాతం ప్రేక్ష‌కుల‌ను మాత్ర‌మే అనుమ‌తించ‌నున్న‌ట్లు పేర్కొంది.
 
ఇకపోతే.. చెన్నై సూపర్ కింగ్స్.. ఐపీఎల్‌లో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్లలో ఒకటి. ముంబై తర్వాత సక్సెస్​ఫుల్ టీమ్ ఇది. మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీ సహా వెటరన్​ ప్లేయర్లతో డ్యాడ్స్​ఆర్మీగా పేరు తెచ్చుకున్నా.. బరిలోకి దిగితే బాక్స్​బద్దలు కొట్టే ఆటతో చెలరేగిపోవడం సీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కే నైజం. 
Chennai Super kings
 
పోటీపడ్డ 12 సీజన్లలో నాలుగుసార్లు టైటిల్​ గెలిచి, ఐదు సార్లు రన్నరప్​గా నిలిచింది. 2020లో మాత్రమే లీగ్ స్టేజ్ లోనే ఇంటిముఖం పట్టినా గతేడాది టైటిల్​ నెగ్గి తన దమ్ము చూపింది. ఇప్పుడు డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. 
 
మరో ట్రోఫీ నెగ్గి ముంబై అత్యధిక టైటిల్స్ రికార్డును సమం చేయాలని చూస్తోంది. అయితే లీగ్ ప్రారంభానికి ఒక్క రోజు ముందే ధోనీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని జడేజాను కెప్టెన్ చేయడం అభిమానులను షాక్‌కు గురి చేసింది. 
 
టీమ్ భవిష్యత్తు కోసమే ధోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆటగాడిగా జట్టులో కొనసాగుతూ జడేజాకు కెప్టెన్సీ మెళకువలు అందిస్తూ అతన్ని మేటి సారథిగా తీర్చిదిద్దాలనేదే ధోనీ లక్ష్యం కావచ్చు.
 
ఈసారి ధోనీ, రవీంద్ర జడేజా, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీలాంటి ప్రధాన ప్లేయర్లను రిటైన్ చేసుకున్న ఈ జట్టు.. వేలంలో దీపక్ చహర్, అంబటి రాయుడు, రాబిన్ ఊతప్ప, డ్వేన్ బ్రావోలను మళ్లీ తీసుకుంది.  
 
అలాగే 40 ఏళ్ల ధోనీకి ఇదే చివరి సీజన్ అయ్యే అవకాశం కానుంది. దీంతో ట్రోఫీ నెగ్గి మహీకి సెండాఫ్​ ఇవ్వాలని మేనేజ్ మెంట్ భావిస్తోంది. గాయంతో దీపక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చహర్ దాదాపు సగం సీజన్ కు దూరం కావడం, వీసా దొరకని కారణంగా మొదటి మ్యాచ్ కు మొయిన్​ అలీ అందుబాటులో లేకుండానే శనివారం కోల్ కతా నైట్ రైడర్స్ తో చెన్నై పోటీ పడనుంది.
 
ధోనీ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నా ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడని సీఎస్‌కే స్పష్టం చేసింది. కాబట్టి పేరుకు జడేజానే కెప్టెన్ అయినా.. కీలక నిర్ణయాలన్నీ ధోనీ తీసుకుంటాడు. 
 
జడేజా సైతం ధోనీ సలహాలతోనే ముందుకు వెళ్తానని చెప్పాడు. చెన్నైకి కూడా ప్రధాన బలం ధోనీనే. గతేడాది బ్యాటింగ్‌లో దుమ్మురేపిన రుతురాజ్ గైక్వాడ్ ఈ సారి కూడా కీలకం కానున్నాడు.
 
కెప్టెన్‌గా అనుభవం లేని జడేజా ఈ సవాల్‌ను ఎలా స్వీకరిస్తాడనేది చూడాలి. కెప్టెన్సీ ఒత్తిడికి గురై అతని వ్యక్తిగత ప్రదర్శనపై ప్రభావం చూపితే జట్టుకు తీవ్ర నష్టం జరుగుతుంది.