ఎయిర్ టెల్ 3జీ సేవలు నిలిపివేత.. కస్టమర్లు ఏం చేయాలంటే?
ప్రముఖ టెలికాం రంగ సంస్థ ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను నిలిపివేసింది. ఇంకా కస్టమర్లు ఏం చేయాలో ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉచిత డేటా పేరిట సంచలనం సృష్టించిన జియోతో పోటీపడేందుకు టెలికాం రంగ సంస్థలన్నీ వివిధ రకాల ఆఫర్లను ప్రకటిస్తూ వున్నాయి. ఇందులో ఒకటైన ఎయిర్‌టెల్ త్రీ-సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
దీనిప్రకారం తొలి విడతగా కోల్‌కతాలో ఎయిర్‌టెల్ సంస్థ 3జీ సేవలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎయిర్‌టెల్ సంస్థ వెలువరించిన ప్రకటనలో.. 3జీని ఉపయోగిస్తున్న కస్టమర్లు.. ఈ సేవలకు అందించే 900 ఎమ్‌హెచ్‌జెడ్‌ను అలాగే 4జీ సేవలుగా మార్చుకోవచ్చునని తెలిపింది. అయితే 2జీ సేవలు మాత్రం కస్టమర్లకు అందుబాటులో వుంటాయని తేల్చి చెప్పేసింది.
కస్టమర్లు చాలామంది.. ఎయిర్ టెల్ 2-జీ సేవలను కొనసాగిస్తుండటంతో ఆ సేవలను ఆపమని ఎయిర్‌టెల్ సంస్థ వెల్లడించింది. కానీ 3జీ సేవలను నిలపడం వల్ల ఎలాంటి నష్టాలుండవని.. ఇంకా 3జీ కస్టమర్లు తక్కువగానే వున్నట్లు ఎయిర్‌టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది. అందుచేత 3జీ కస్టమర్లను అలాగే 4జీ వినియోగదారులుగా మార్చేస్తామని ఆ సంస్థ పేర్కొంది.