1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 16 నవంబరు 2017 (17:25 IST)

ఎయిర్ టెల్ కొత్త ఆఫర్.. జియోకు పోటీ ప్రీపెయిడ్ ప్లాన్స్

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. చౌక ధరకే డేటాను ఇవ్వడంతో ఇతర కంపెనీలన్నీ పోటీపడుతున్నాయి. జియో పోటీని ఎదుర్కునేందుకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెడుతోంది. కొత

టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో.. చౌక ధరకే డేటాను ఇవ్వడంతో ఇతర కంపెనీలన్నీ పోటీపడుతున్నాయి. జియో పోటీని ఎదుర్కునేందుకు టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ రోజుకో కొత్త ఆఫర్‌ను ప్రవేశపెడుతోంది. కొత్త ఆఫర్ ద్వారా ప్రీపెయిడ్ వినియోగదారులను ఎయిర్ టెల్ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం మూడు భారీ రీఛార్జీ ఆఫర్లను ప్రవేశపెట్టింది. 
 
రూ.3,999తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాది పాటు అన్నీ లోకల్, ఎస్టీడీ కాల్స్ ఉచితంగా పొందవచ్చునని ఎయిర్ టెల్ ప్రకటించింది. ఈ ఆఫర్ ద్వారా 300 జీబీ డేటాతోపాటు ప్రతిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా పంపే సదుపాయం క‌ల్పించింది.
 
అలాగే రూ. 1999 రీఛార్జ్‌తో 180 రోజుల పాటు అన్ని లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌‌తోపాటు 125 జీబీ డేటాను పొందడంతో పాటు అదనంగా రోజుకు వంద ఎస్సెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తుంది. రూ. 999 రీఛార్జ్‌తో 90 రోజుల పాటు అన్ని లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌ కాకుండా.. 60 జీబీ డేటాతోపాటు రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు అదనంగా పొందవచ్చునని ఎయిర్ టెల్ ఓ ప్రకటనలో వెల్లడించింది.