మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 12 జులై 2024 (15:51 IST)

బీఎస్ఎన్‌ఎల్ నుంచి అదిరిపోయే ఆఫర్.. 13 నెలల వ్యాలిడిటీతో..?

bsnl
దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురాబోతోంది ప్రభుత్వరంగ టెలికం ఆపరేటర్ బీఎస్ఎన్‌ఎల్. అయితే 4జీ సేవల ప్రారంభానికి ముందే అదిరిపోయే ఆఫర్‌ను బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. 13 నెలల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్ ధర రూ. 2,399గా ఉంది. 
 
నెలకు రూ.200 కంటే తక్కువే పడుతున్న ఈ ఆఫర్‌లో రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. ఇక రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, ఉచిత రోమింగ్, ఇంకా అనేక విలువ ఆధారిత సేవలను యూజర్లు పొందవచ్చు. 
 
అలాగే ఒక ఏడాది ప్లాన్లలో భాగంగా 365 రోజుల ప్లాన్‌ను కూడా బీఎస్ఎన్‌ఎల్ అందిస్తోంది. ఈ ప్లాన్‌లో రోజువారీ పరిమితి లేకుండా మొత్తం 600జీబీల డేటాను కంపెనీ అందిస్తోంది. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, దేశవ్యాప్తంగా ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్ చేసుకోవచ్చు.