శుక్రవారం, 20 సెప్టెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 6 జులై 2024 (15:24 IST)

5జీ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టిన రిలయన్స్ జియో!!

jio reliance
ప్రైవైట్ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో తాజాగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్లను తాజాగా ప్రవేశపెట్టింది. ఇప్పటికే టెలికాం చార్జీలను సవరించిన రిలయన్స్ జియో... కొత్తగా ఈ డేటా బూస్టర్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్‌ డేటా ప్లాన్లు రీఛార్జి చేసిన యూజర్ల కోసం వీటిని తీసుకొచ్చింది. ఈ కేటగిరీకి చెందిన మొబైల్ యూజర్లు ఈ ప్లాన్లతో రీఛార్జి చేసుకుంటే 4జీ డేటాతో పాటు అపరిమిత డేటా సేవలను ఆనందించొచ్చు.
 
కొత్త ప్లాన్లు తీసుకురాక ముందు 5జీ నెట్‌వర్క్‌ పరిధిలో ఉన్న 5జీ మొబైల్‌ యూజర్లందరికీ దాదాపు అన్ని ప్లాన్లపై అపరిమిత 5జీ డేటాను జియో అందించేది. ప్లాన్ల సవరణ తర్వాత 2జీబీ ప్లాన్లు రీఛార్జి చేసుకున్న వారికే అనే షరతు విధించింది. ఈ నేపథ్యంలో కొత్త ప్లాన్లను జియో తన వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తెచ్చింది. ట్రూ అన్‌లిమిటెడ్‌ అప్‌గ్రేడ్‌ సెక్షన్‌లో వీటిని పొందుపరిచింది.
 
రూ.51, రూ.101, రూ.151 ధరల్లో ఈ మూడు ప్లాన్లు అందుబాటులోకి తెచ్చింది. రూ.51తో రీఛార్జి చేసుకుంటే 3జీబీ 4జీ మొబైల్‌ డేటా లభిస్తుంది. అపరిమిత 5జీ డేటాను ఆనందించొచ్చు. రూ.101 ప్లాన్‌పై 6జీబీ, రూ.151 ప్లాన్‌పై 9జీబీ డేటా లభిస్తుంది. ప్లాన్‌ వ్యాలిడిటీనే వీటికి వర్తిస్తుంది. అయితే, రూ.479, రూ.1899 వాల్యూ ప్లాన్లకు ఈ డేటా ప్లాన్లు వర్తించవు. రూ.799 వంటి ఇతర అన్‌లిమిటెడ్‌ ప్యాక్స్‌కు వర్తిస్తుంది.