Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌‌లో ఎర్రిక్సన్ 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌.. వచ్చే మూడేళ్లలోపు..?

భారత్‌‌లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు రంగం సిద్ధం అవుతోంది. స్పీడన్‌కు చెందిన టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ ''ఎరిక్సన్'' జూలై మూడో తేదీ (మంగళవారం) 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఢిల్లీ ఐ

Written By selvi
Updated: బుధవారం, 4 జులై 2018 (10:00 IST)
భారత్‌‌లో 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్‌కు రంగం సిద్ధం అవుతోంది. స్పీడన్‌కు చెందిన టెలీకమ్యూనికేషన్స్ కంపెనీ ''ఎరిక్సన్'' జూలై మూడో తేదీ (మంగళవారం) 5జీ ఇన్నోవేషన్ ల్యాబ్ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఢిల్లీ ఐఐటీలో ఆవిష్కరించింది. కేంద్రమంత్రి మనోజ్ సిన్హా చేతుల మీదుగా ఇది ప్రారంభమైంది. 
 
రానున్న మూడేళ్ళలో భారత్‌లో 5జీని రియాల్టీలోకి తీసుకునేందుకు మొత్తం ఎకో-సిస్టమ్ కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా సిన్హా వెల్లడించారు. ఆరోగ్యం, విద్య, డిజాస్టర్ మేనేజ్‌మెంట్, మరికొన్ని ఇతర రంగాల్లో 5జీ టెక్నాలజీని సమర్థవంతంగా ఉపయోగించుకొనేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని సిన్హా వెల్లడించారు. 
 
భారత్‌లో డేటా వినియోగదారులు అధికసంఖ్యలో ఉన్నారని, ప్రపంచంలోని అన్నీ దేశాల్లో కన్నా భారత్ లోనే డేటా వినియోగం అధికంగా ఉంటుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న ట్రాయ్ చైర్మన్ ఆర్ ఎస్ శర్మ తెలిపారు. 5జీ సేవలు ప్రారంభమైతే ఇక అన్నీ రంగాల్లో భారత్ దూసుకెళ్లడం ఖాయమని హర్షం వ్యక్తం చేశారు. 

అన్నీ చూడండి

సందీప్ రెడ్డి వంగా సినిమా రోమాంచకం టైటిల్ సాంగ్ రిలీజ్

సత్యజిత్ రే, రాజమౌళి సినిమాలు ఇష్టపడతాను : దర్శకుడు ఉదయ్ చౌహాన్

jony master :దళారులు లేకుండా కళాకారులకు నేరుగా చెల్లింపులు : టీ.జి. విశ్వ ప్రసాద్

రూరల్ ఎంటర్‌టైనర్‌గా శివకార్తికేయన్ చిత్రం సెయాన్ రెండో షెడ్యూల్ షురూ

Haiwaan: అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్ ల హైవాన్ టీజర్ రిలీజ్

తర్వాతి కథనం
Show comments