బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 5 మే 2017 (15:29 IST)

సమ్మర్ సేల్స్ : పోటాపోటీగా ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్ ఆఫ‌ర్లు.. 80 శాతం డిస్కౌంట్‌!

ఈ-కామర్స్ దిగ్గజాలు సమ్మర్ సేల్స్ పేరుతో పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఈ కోవలో ఏకంగా 80 శాతం మేరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లు పోటీ పడుతున్నాయి. తద్వారా వి

ఈ-కామర్స్ దిగ్గజాలు సమ్మర్ సేల్స్ పేరుతో పోటాపోటీగా ఆఫర్లు గుప్పిస్తున్నాయి. ఈ కోవలో ఏకంగా 80 శాతం మేరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. ఈ విషయంలో ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లు పోటీ పడుతున్నాయి. తద్వారా వినియోగ‌దారుల‌ను త‌మ‌వైపు తిప్పుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. 
 
ముఖ్యంగా.. ప‌దో వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈనెల 14 నుంచి 18 వ‌ర‌కు 5 రోజుల‌పాటు బిగ్‌10 సేల్ పేరుతో ఫ్లిప్‌కార్ట్ ముఖ్య‌మైన బ్రాండ్ల‌పై ఏకంగా 80 శాతం రాయితీ ప్ర‌క‌టించింది. మ‌రోవైపు ఫ్లిప్‌కార్ట్ బిగ్ 10 సేల్‌కు ముందే అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్ పేరుతో మే 11 నుంచి 14 వ‌ర‌కు 5 రోజుల‌పాటు గ‌తంలో క‌నీవినీ ఎరుగ‌ని ఆఫ‌ర్లు ప్ర‌క‌టించింది. 
 
కాగా, 80 శాతం మేరకు డిస్కౌంట్ ఇస్తూనే... మళ్లీ 5 నుంచి 10 శాతం మేరకు క్యాష్‍బ్యాక్ ఆఫర్‌ను ఇవ్వడం గమనార్హం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండూ స్మార్ట్‌ఫోన్లు, ఎల‌క్ట్రానిక్ వ‌స్తువుల‌పై భారీ రాయితీలు ప్ర‌క‌టించాయి. భార‌తీయ వినియోగ‌దారులు రాయితీ ల‌వ‌ర్లు కాబ‌ట్టి సేల్ చాలా ఉధృతంగా ఉండే అవ‌కాశం ఉంద‌ని ఆన్‌లైన్ క్రాఫ్ట్ కంపెనీ ఎక్స్‌క్లూజివ్ లేన్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు ధ్రువ్ గోయ‌ల్ పేర్కొన్నారు.