శనివారం, 30 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 జనవరి 2023 (18:50 IST)

బోనస్ లు ఆలస్యం చేసిన గూగుల్: 12,000 ఉద్యోగాల కోత

Google
టెక్నాలజీ రంగంలో ముందున్న గూగుల్ ఉద్యోగాలపై కోతలు విధిస్తోంది. మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు బారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో గూగుల్ ఉద్యోగాలపై కోత విధించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 12వేల మందిని తొలగిస్తున్నట్లు తెలిపింది.
 
ఈ విషయాన్ని కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెయిల్ ద్వారా తెలియజేశారు.  దీంతో రిక్రూటింగ్, కార్పొరేట్ కార్యకలాపాలు, ఇంజినీరింగ్, ప్రొడక్ట్స్ టీమ్ కు చెందిన విభాగాలతో పాటు ఇతర విభాగాల్లోనూ ఉద్యోగ కోతలు వుండనున్నాయి. అమెరికాలోని సిబ్బంది ఈ ప్రభావం అధికంగా వుంటుందని ఆల్ఫాబెట్ తెలిపింది.