సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 15 జనవరి 2023 (13:07 IST)

గూగుల్‌లో దేనినైనా సెర్చ్ చేయొచ్చు.. కానీ.. వాటిని సెర్చ్ చేస్తే?

గూగుల్‌లో దేనినైనా సెర్చ్ చేయొచ్చు కానీ, కొన్నింటిని సెర్చ్ చేస్తే క్రిమినల్ యాక్ట్ నడుస్తుందని ప్రకటించారు. సాధారణంగా గూగుల్‌లో అన్ని విషయాలు సెర్చ్ చేయవచ్చన్న విషయం తెలిసిందే. అయితే అదే సమయంలో బాంబును ఎలా తయారు చేయాలో వెతికితే సైబర్ క్రైమ్ నిఘాలో పడే అవకాశం ఉందని చెబుతున్నారు. 
 
అంతేకాక, బాంబు సమాచారాన్ని సేకరించడం జైలు శిక్షార్హమైన నేరం. అదేవిధంగా 18 ఏళ్ల లోపు పిల్లల అశ్లీల చిత్రాల కోసం సెర్చ్ చేస్తే పోక్సో చట్టం కింద శిక్షార్హులవుతారు. 
 
ఇంటర్నెట్‌లో క్రిమినల్ నేరాలకు సంబంధించిన ప్రశ్నలు అడగడం అంటే అబార్షన్‌కు సంబంధించిన సమాచారాన్ని వెతకడం, కాపీరైట్ ఉన్న చిత్రాలను వెతకడం కూడా శిక్షార్హమైన నేరంగా ప్రకటించారు.