Webdunia - Bharat's app for daily news and videos

Install App

జియో మరో సంచలనం.. స్మార్ట్‌ఫోన్లను లాంఛ్ చేసేందుకు సై!

Written By సెల్వి
Updated: శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (21:49 IST)
టెలికాం రంగంలో డేటా విప్లవం సృష్టించిన జియో మరో సరి కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. సబ్ స్క్రైబర్లను పెంచుకోవడమే లక్ష్యంగా సంస్థ సరికొత్త వ్యూహాలను సిద్ధం చేసుకుంటుంది. జియో ఫోన్లపై ఆఫర్లు ఇవ్వనుంది. అంతే కాకుండా తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లను లాంఛ్ చేయడానికి జియో సిద్ధమైంది.  
 
స్మార్ట్ ఫోన్లపై భారీగా ఆఫర్లు ఇవ్వడం, తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం ద్వారా సబ్ స్క్రైబర్ల పెరుగుదలను నమోదు చేయవచ్చని జీయో యోచిస్తోంది. తద్వారా మార్కెట్లో తనకు తిరుగు లేదని మరో సారి నిరూపించుకోవాలన్నది సంస్థ వ్యూహంగా తెలుస్తోంది. అయితే కొన్ని రోజులగా జీయో నుంచి స్మార్ట్ ఫోన్లు వస్తాయన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
 
తక్కువ ధరకు డేటా అందించి దేశంలో ఇంటర్ నెట్ విప్లవాన్ని తీసుకువచ్చిన జియో నుంచి వస్తున్న స్మార్ట్ ఫోన్లపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఈ ఫోన్లు విడుదలైతే మార్కెట్లో సంచలనం సృష్టించడం ఖాయమన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. 
 
మరోవైపు.. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా వ్యాపారాలు నిర్వహించేవారికి 'జియో బిజినెస్' పేరుతో సరికొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించింది రిలయెన్స్ జియో. తక్కువ ధరకే డేటా, వాయిస్ సేవల్ని అందిస్తోన్న సంగతి తెలిసిందే. 

అన్నీ చూడండి

Adivi Sesh: అడివి శేష్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘G2’ 2027న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్

Nani: న్యాచురల్ స్టార్, కయాదు లోహార్ బ్రాండ్ న్యూ పోస్టర్

Allu and Rashmika: రాకా కోసం క్రేజీ కాంబినేషన్ పుష్ప జోడీ మళ్లీ రంగంలోకి దిగింది !

Manchu Mano: ఆస్మాన్ తో మేఘాంశ్ గొప్ప హిట్ కొట్టాలని కోరుకుంటున్నా : మంచు మనోజ్

SS Rajamouli: వారణాసిలో రామాయణ ఎపిసోడ్ కోసం భారీ సెట్టింగ్ ?

తర్వాతి కథనం
Show comments