శుక్రవారం, 1 నవంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (18:38 IST)

అమేజాన్‌లో ఎర్త్ వీక్ సేల్- ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లపై భారీ తగ్గింపు..

ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ అమేజాన్‌కు చెందిన వెబ్‌సైట్‌లో ఇవాళ ఎర్త్ వీక్ సేల్ స్టార్ట్ అయ్యింది. ఈ సేల్ ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సేల్‌లో భాగంగా రీఫర్బిష్ చేయబడినటువంటి స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను తగ్గింపు ధరలకే విక్రయించనున్నారు. అలాగే పలు రకాలైన ఆఫర్లను కూడా వినియోగదారులకు అందిస్తున్నారు. 
 
ఈ క్రమంలోనే ప్రొడ‌క్ట్స్‌పై 200కు పైగా ఆక‌ట్టుకునే డీల్స్‌ను అందిస్తున్నారు. అమెజాన్ ఎర్త్ వీక్ సేల్‌లో భాగంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన ఎంఐ ఎ2 కేవ‌లం రూ.9,899 ధ‌ర‌కే ల‌భిస్తుంది. అదే విధంగా రీఫ‌ర్బిష్ చేయ‌బ‌డిన కోర్ ఐ5 ల్యాప్‌టాప్‌లు రూ.19,990 నుంచి, కోర్ ఐ7 ల్యాప్‌టాప్‌లు రూ.23,990 నుంచి ల‌భిస్తున్నాయి. రీఫర్బిష్ చేయబడిన ల్యాప్‌టాప్‌లపై 50 శాతం వరకు, స్పీకర్లపై 60 శాతం వరకు తగ్గింపును కూడా అందిస్తున్నారు.