మైక్రోమ్యాక్స్ గుడ్ న్యూస్: జూలై 30వ తేదీన 12 గంటలకు..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తమ వినియోగదారులకు గుడ్ న్యూస్. అదిరిపోయే ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మైక్రోమ్యాక్స్ సంస్థ పేర్కొంది.
భారత మార్కెట్‌లో జూలై 30వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీతోపాటు డ్యూయల్ రియర్ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనున్నట్లు సంస్థ తెలిపింది.
మైక్రోమ్యాక్స్ ఇన్ 2బీ స్మార్ట్‌ఫోన్లను ఫ్లిప్‌కార్ట్, మైక్రోమ్యాక్స్ ఆన్‌లైన్ స్టోర్ల ద్వారా కస్టమర్స్ కొనుగోలు చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. మైక్రోమాక్స్ ఇన్ 2బీ ఫోన్ 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. మైక్రోమాక్స్ ఇన్ 2బీలో వెనుక-మౌంటెడ్ వేలిముద్ర స్కానర్‌ను కలిగి ఉంటుంది.