గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 27 జులై 2021 (13:36 IST)

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో బిగ్ బీ.. రామోజీ ఫిల్మ్ సిటీలో..?

Amitab
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సూపర్ స్టార్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ప్రభాస్, నాగ్ అశ్విన్ మూవీ ప్రాజెక్ట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చిన అమితాబ్‌ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌‌లో భాగంగా మొక్కలు నాటారు.
   
భావి తరాలకు పచ్చదనంతో కూడిన పర్యావరణం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అమితాబ్. ఇందులో భాగంగా ఎంపీ సంతోష్ చేపట్టిన  గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ కార్యక్రమాన్ని మెచ్చుకున్నారు బిగ్‌బీ. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రశంసించిన సంగతి తెలిసిందే కదా.  
 
ఈ కార్యక్రమంలో బిగ్‌బీతో పాటు ఎంపీ సంతోష్, సినీ హీరో నాగార్జున, నిర్మాత అశ్వనీదత్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండీ విజయేశ్వరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమితాబ్ మొక్క నాటిన తర్వాత ఆయనతో కలిసి ఎంపీ సంతోష్ ఓ సెల్ఫీ తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా అమితాబ్‌తో పాటు నాగార్జున మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలన్నారు. ఈ సందర్భంగా బిగ్‌బీ మాట్లాడుతూ.. ఎంసీ సంతోష్ ఇప్పటి వరకు 16 కోట్ల వరకు మొక్కలు నాటించిన విషయాన్ని తెలుసుకొని ఆయన చేస్తోన్న కార్యక్రమం నిర్విరామంగా కొనసాగాలని ఆకాంక్షించారు.