మోటోరోలా మోటో జీ5జీ స్మార్ట్ ఫోన్.. ఫ్లిఫ్ కార్ట్‌లో సేల్ ప్రారంభం
మనదేశంలో మోటోరోలా మోటో జీ5జీ స్మార్ట్ ఫోన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ ఫోన్ సేల్ ప్రారంభమైంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.20,999గా నిర్ణయించారు. హెచ్‌డీఎఫ్‌సీ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ కూడా లభించనుంది.
ఇందులో క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌ను అందించారు. వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతో 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ సామర్థ్యమున్న మరో రెండు కెమెరాలు ఉన్నాయి.
5000 ఎంఏహెచ్ బ్యాటరీని కూడా ఇందులో అందించారు. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. వొల్కానిక్ గ్రే, ఫ్రాస్టెడ్ సిల్వర్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఇందులో 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్టీపీఎస్ డిస్ ప్లేను అందించనున్నారు.
క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 750జీ ప్రాసెసర్‌పై మోటో జీ 5జీ పనిచేయనుంది. ఇందులో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ను అందించారు. దీన్ని మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.