Daily Horoscope
✕

శుభవార్త చెప్పిన ఫోన్ పే... ఇక విదేశాల్లోనూ యూపీఐ సేవలు

Written By సెల్వి
Updated: బుధవారం, 8 ఫిబ్రవరి 2023 (09:30 IST)
ఫోన్ పే శుభవార్త చెప్పింది. యూఏఈ, సింగపూర్, మారిషస్, నేపాల్, భూటాన్ దేశాల్లో యూపీఐ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఫోన్ పే ప్రకటించింది. ఫలితంగా అంతర్జాతీయంగానూ యూపీఐ సేవలను తీసుకొచ్చింది. ఈ సేవల వల్ల భారతీయులు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు నగదు మార్పిడి చేసుకోవాల్సిన అవసరం వుండదు. భారతీయ బ్యాంకు ఖాతా ద్వారా నేరుగా నగదు చెల్లింపులు చేసుకోవచ్చు. 
 
విదేశాల్లో యూపీఐ చెల్లింపుల కోసం అనువైన సాంకేతికతను ఏప్రిల్ 30 లోపు సిద్ధం చేసుకోవాలని ఎన్‌పీసీఐ గత నెలలోనే ఫిన్‌టెక్ సంస్థలకు సూచించింది. ఇందులో భాగంగానే ఫోన్ పే ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. 
 
ఈ సేవల ద్వారా భారతీయులు అక్కడి వెళ్లినప్పుడు పేమెంట్స్ చేస్తే విదేశీ కరెన్సీ వారి బ్యాంక్ ఖాతా నుంచి డెబిట్ అవుతుంది. విదేశాల్లో ప్రయాణించే భారతీయులు అక్కడ చెల్లింపులు చేసేటప్పుడు ఈ సేవలు ఎంతగానో ఉపయోగపడతాయని, త్వరలోనే మరిన్ని దేశాలకు వీటిని విస్తరిస్తామని ఫోన్ పే ప్రకటించింది. 

అన్నీ చూడండి

Allu Arha: శ్రీలంకలో జాయ్ ఆఫ్ మై లైఫ్. అల్లు అర్హకు అల్లు అర్జున్ విషెస్

Rashmika : మైసా లో ఒసేయ్ రాములమ్మ సాంగ్‌ బాధ్యతను పెంచింది : రష్మిక మందన్న

Priyadarshi : ఇడుపు కాయితం నుంచి గోగులు గోగులు లిరికల్ సాంగ్

లక్ష్మణుడు కథతో సరికొత్త ప్రయోగంగా ది లక్ష్మణ – అన్‌టోల్డ్ స్టోరీ

Keethy : కీర్తి సురేష్ -కృతిశెట్టి వదిన- మరదళ్ల డివికి డివికి డుక్కుం సాంగ్ వచ్చేసింది

తర్వాతి కథనం
Show comments