1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 జనవరి 2023 (15:15 IST)

కంటెంట్ క్రియేటర్లకు అనువైన ల్యాప్ టాప్... HP X360 15

HP X360 15
HP X360 15
కంటెంట్ క్రియేటర్లకు మరింత మెరుగ్గా సేవలందించడానికి హెచ్పీ కొత్త ల్యాప్ టాప్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టనుంది. 15.6-అంగుళాల OLED టచ్ డిస్ ప్లేతో HP X360 15 అనే ఈ ల్యాప్ టాప్.. రాసేందుకు, చూసేందుకు, గేమ్స్ ఆడుకునేందుకు అనువుగా వుంటుంది. గొప్ప డిజైన్ తో, కొత్త HP X360 15 పోర్ట్ ఫోలియోలో వుంటుంది. 
 
కొత్త హెచ్పీ ఎక్స్360 15 లైనప్ లో 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఈవో ఐ7 ప్రాసెసర్, ఇంటెల్ ఐరిస్ ఎక్స్ఈ గ్రాఫిక్స్ తో ఇంటిగ్రేట్ చేసి పెద్ద డిస్ ప్లే, అద్భుతమైన పనితీరును అందించారు.
 .
దీనిని ఎక్కువ కాలం ఉపయోగించినప్పటికీ, యాంటీ-రిఫ్లెక్టివ్ - ఫ్లికర్-ఫ్రీ స్క్రీన్ కారణంగా అత్యున్నత రంగు ను కలిగివుంటుంది. ఇందులో ఐస్సేఫ్ డిస్ ప్లే కంటి ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది. అత్యుత్తమ సృజనాత్మక, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈ ల్యాప్ టాప్ ద్వారా హెచ్ పీ అందిస్తోంది.

కీలక ఫీచర్లు
డిస్ప్లే: 33.8 సెంటీమీటర్లు (13.3 అంగుళాలు), ఓఎల్ఈడీ
మెమొరీ: 16 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ రోమ్
ప్రాసెసర్: ఇంటెల్ కోర్ ఐ7 12వ జనరేషన్
ఓఎస్: విండోస్ 11 హోమ్
గ్రాఫిక్స్: ఇంటెల్ ఐరిస్ క్సే
సాఫ్ట్వేర్: మైక్రోసాఫ్ట్ ఆఫీస్ హోమ్ అండ్ స్టూడెంట్ 2021, మెకాఫీ లైవ్సేఫ్
వారంటీ: 1 సంవత్సరం ఆన్సైట్