శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By ఠాగూర్

కొత్త సంవత్సరం వేళ చౌక ధరలకే ఆకాశయానం

airasia
దేశంలోని ప్రైవేటు విమానయాన సంస్థలు కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా, చౌక ధరకే విమాన ప్రయాణ అవకాశాన్ని కల్పించాయి. దేశీయ సర్వీసుల్లో ఈ చౌక ధర టిక్కెట్ రూ.2023గా ఇండిగో ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్ణయించింది. అలాగే, అంతర్జాతీయ సర్వీసుల్లో రూ.4999గా ఖరారు చేసింది. అయితే, ఎయిర్ ఏషియా మాత్రం రూ.1479కే ఈ టిక్కెట్‌ను ఆఫర్ చేస్తుంది. 
 
ఎయిర్ ఏషియా సంస్థ బెంగుళూరు కోచ్చి తదితర మార్గాల్లో 1497కే టిక్కెట్లను విక్రయించింది. డిసెంబరు 25వ తేదీ లోపు టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పించింది. 2023 జనవరి 15 నుంచి 2023 ఏప్రిల్ 14వ తేదీ మధ్య ప్రయాణ టిక్కెట్లపై ఈ ఆఫర్లను ప్రటించింది. ఎయిర్ ఏషియా పోర్టల్, మొబైల్ యాప్, ఇతర బుకింగ్ సైట్లలో ఈ ప్రయాణ ఆఫర్‌‍ను పొందవచ్చని ఆ సంస్థ తెలిపింది.