జీయో నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం.. సేవల్లో అంతరాయం..!
దేశంలో ప్రైవేట్ మొబైల్ దిగ్గజ ఆపరేటింగ్ సంస్థగా ఉన్న జియో సేవలకు బుధవారం అంతరాయం ఏర్పడింది. ఈ కంపెనీ నెట్‌వర్క్‌లో సాంకేతిక లోపం తలెత్తడం వల్లే ఈ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడినట్టు సమాచారం. ఈ విషయాన్ని డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది.
నెట్‌వర్క్ సమస్య గురించి వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగినట్లు తెలిపింది. అయితే దీని ప్రభావం ఏమేరకు ఉందనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. అదేసమయంలో జియో నెట్‌వర్క్‌లో అంతరాయంపై వినియోగదారులు ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు.
భారత్‌లో జియోడౌన్ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతున్నట్లు డౌన్ డిటెక్టర్ తెలిపింది. ఇప్పటివరకు దాదాపు 4 వేల మంది వినియోగదారులు ఈ నెట్‌వర్క్ సమస్యను నివేదించారు. అయితే, ఈ సమస్య తాత్కాలికమేనని, పరిష్కారం కోసం తమ బృందం పనిచేస్తున్నట్లు కస్టమర్ కేర్ నుంచి సమాధానం వచ్చినట్లు చెప్పింది.