సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (10:46 IST)

శాంసంగ్ నవరాత్రి ఫెస్టివల్ ఆఫర్... గెలాక్సీ ఫోన్లపై భారీ డిస్కౌంట్

దేశవ్యాప్తంగా దసరా పండుగ సీజన్ ఆరంభమైంది. దీంతో చిన్నాచితకా కంపెనీలతో పాటు బడా కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్లు కుమ్మరిస్తున్నాయి. ఈ కోవలో ఈ-కామర్స్‌ కంపెనీలైతే ఒక అడుగు ముందుగానే ఉంది.

దేశవ్యాప్తంగా దసరా పండుగ సీజన్ ఆరంభమైంది. దీంతో చిన్నాచితకా కంపెనీలతో పాటు బడా కంపెనీలు కూడా వరుసబెట్టి ఆఫర్లు కుమ్మరిస్తున్నాయి. ఈ కోవలో ఈ-కామర్స్‌ కంపెనీలైతే ఒక అడుగు ముందుగానే ఉంది. 
 
తాజాగా స్మార్ట్‌ఫోన్ల రారాజు శాంసంగ్‌ కూడా నవరాత్రి స్పెషల్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా తన గెలాక్సీ ఎస్‌8, గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల ధరను 4 వేల రూపాయల మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. 
 
దీంతో లాంచింగ్‌ సందర్భంగా రూ.57,900 ఉన్న గెలాక్సీ ఎస్‌8 ధర 53,990 రూపాయలకు దిగొచ్చింది. అలాగే 64,900 రూపాయలున్న గెలాక్సీ ఎస్‌8 ప్లస్‌ ఇక 60,990 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు కస్టమర్లకైతే మరో 4000 రూపాయలను అదనంగా క్యాష్‌బ్యాక్‌ కింద అందిస్తుంది. అంటే మొత్తంగా 8 వేల రూపాయల మేర ధర తగ్గించినట్టు తెలిసింది.