సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (10:44 IST)

శ్రీవారి క్యాలెండర్లు - డైరీలపై జీఎస్టీ ప్రభావం... పెరిగిన ధరలు

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోలతో టీటీడీ బోర్డు ముద్రించే వార్షిక క్యాలెండర్లు, డైరీలకు ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతి శ్రీవారి భక్తుడు పోటీపడుతుంటాడు. అయి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఫోటోలతో టీటీడీ బోర్డు ముద్రించే వార్షిక క్యాలెండర్లు, డైరీలకు ప్రత్యేక పేరు, గుర్తింపు ఉంది. ముఖ్యంగా.. వీటిని కొనుగోలు చేసేందుకు ప్రతి శ్రీవారి భక్తుడు పోటీపడుతుంటాడు. అయితే, ఈ యేడాది ఈ క్యాలెండర్లు, డైరీలపై జీఎస్టీ పన్నుభారం బాగా పడింది. ఫలితంగా వీటి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. 
 
ప్రతి యేడాది తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి డైరీలు, క్యాలెండర్లను వార్షిక బ్రహ్మోత్సవాల సమయంలో ఆవిష్కరించడం ఆనవాయితీ. అలాగే, ఈ యేడాది, ఈనెల 23వ తేదీ రాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించనున్నారు. ఆ వెంటనే విక్రయాలు ప్రారంభించాలని తితిదే నిర్ణయించింది. 
 
ఇందుకోసం 12 పుటల క్యాలెండర్లు 20 లక్షలు, డైరీలు 10 లక్షలు, శ్రీవారు, పద్మావతి అమ్మవారి ఫొటోలతో పెద్ద క్యాలెండర్లు వేర్వేరుగా 14 లక్షలు, శ్రీనివాసుడు, అమ్మవారి చిన్న క్యాలెండర్లు, పంచాగం క్యాలెండర్లు సిద్ధం చేశారు. వస్తు సేవల పన్ను(జీఎస్టీ) ప్రభావంతో డైరీలు, క్యాలెండర్ల ధరలు పెరిగాయని అధికారులు తెలిపారు. 12 పుటల క్యాలెండర్‌ ధర రూ.75 నుంచి 100; డైరీ ధర రూ.100 నుంచి రూ.120కు పెంచినట్టు వారు వివరించారు.