బుధవారం, 6 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 6 ఆగస్టు 2017 (12:17 IST)

7న తిరుమల ఆలయం మూసివేత.. ఎందుకో తెలుసా?

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని ట

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు. దీనికి కారణం ఎంటో తెలుసా? చంద్రగ్రహణం కారణంగా ఆలయాన్ని రేపు సాయంత్రం 4 గంటలకు మూసి వేస్తామని... తిరిగి 8వ తేదీ తెల్లవారుజామున తెరుస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు ప్రకటించారు.  
 
దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఈ చంద్రగ్రహణం సందర్భంగా కేవలం ఆలయం మాత్రమే కాకుండా, లడ్డు ప్రసాద కేంద్రాలను, అన్న ప్రసాద సముదాయాన్నికూడా మూసివేస్తున్నామని తెలిపారు. 
 
ఈ సమయంలో క్యూ కాంప్లెక్స్‌లలోకి కూడా భక్తులను వదలమని చెప్పారు. నడకదారి భక్తులకు కేవలం 6 వేల టోకెన్లను మాత్రమే మంజూరు చేస్తామని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని, భక్తులు తమ పర్యటనను ప్లాన్ చేసుకోవాలని సూచించారు.