బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By selvi
Last Updated : ఆదివారం, 8 అక్టోబరు 2017 (11:50 IST)

ఎలైట్ టెక్నాలజీస్ నుంచి... అత్యంత చౌక ధరలో 4జీ స్మార్ట్ ఫోన్...

దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎలైట్ టెక్నాలజీస్ అత్యంత చౌక ధరలో 4జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఎలైట్ ప్రొ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ‘ఎలైట్ ప్రొ’‌ను నే

దేశీయ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఎలైట్ టెక్నాలజీస్ అత్యంత చౌక ధరలో 4జీ స్మార్ట్ ఫోన్‌ను విడుదల చేసింది. ఎలైట్ ప్రొ పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999. 2500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం ఉన్న ఈ ‘ఎలైట్ ప్రొ’‌ను నేటి నుంచి ‘స్నాప్‌డీల్‌’లో అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. అత్యధిక ఫీచర్లతో కూడిన ఈ ఫోనులో ఐదు అంగుళాల హెచ్డీ ఐపీఎస్ డిస్‌ప్లే వుంటుంది.
 
ఇంకా 3 జీబీ ర్యామ్, 32 జీబీ అంతర్గత మెమొరీ, 64 జీబీ వరకు పెంచుకునే వెసులుబాటు ఉంటుంది. అలాగే ఈ ఫోన్‌ వెనక 13 ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరాలు అమర్చారు. ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఓఎస్‌తో పనిచేస్తుంది. శనివారం మార్కెట్లోకి ఆవిష్కరించిన ఈ ఫోన్లను వినియోగదారులకు నాణ్యతతో అందిస్తామని ఎలైట్ వ్యవస్థాపకులు, సీఈవో శ్రీపాల్ గాంధీ వెల్లడించారు.