మంగళవారం, 14 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (14:10 IST)

న్యూజెర్సీ రైలు ప్రమాదంలో తెలంగాణ టెక్కీ మృతి.. సాయం కోసం...

తెలంగాణకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అమెరికాలో చోటుచేసుకున్న రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన ప్రవీణ్ దేశి అని గుర్తించారు. కాగా మంగళవారం న్యూజెర్సీలోని ఎడిసన్ స్టేషన్ సమీపంలో రైలు కింద నలిగిపోయాడు. ప్రమాదానికి కారణం ఏమిటో తెలియడం లేదు. అతని మృతదేహాన్ని న్యూజెర్సీ ఆస్పత్రిలో భద్రపరిచారు.
Techie
 
ప్రవీణ్ భార్య నవత, రెండేళ్ల కొడుకు ఉన్నారు. ప్రవీణ్ మృతి వార్తతో ఆయన కుటుంబం శోకసముంద్రంలో మునిగిపోయింది. మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకురావడానికి స్నేహితులు సహాయనిధి ఏర్పాటు చేశారు. ప్రవీణ్ అందరితో స్నేహంగా ఉండేవాడని, ఆయన కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు. ప్రవీణ్ కుటుంబం ఆర్థికంగా అతనిపైనే ఆధారపడి ఉంది.