గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 29 నవంబరు 2022 (17:38 IST)

సైబర్ నేరగాళ్ల చేతిలో ట్విట్టర్ డేటా

Twitter
ట్విట్టర్ డేటాపై సైబర్ నేరగాళ్లు కన్నేశారు. సోషల్ మీడియా అగ్రగామి అయిన ట్విట్టర్‌కు చెందిన 54 లక్షల మంది యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారని నిర్ధారణ అయ్యింది. 
 
ఓ బగ్ సాయంతో యూజర్లు సమాచారాన్ని దొంగలించారని తెలిసింది. చోరీ చేసిన డేటాను హ్యాకర్స్ ఫోరంలో వుంచారు. వాట్సాప్ డేటా భారీగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కినట్లు సమాచారం అందిన కొద్ది రోజుల్లోనే ట్విట్టర్ డేటా హ్యాక్ కావడం గమనార్హం. 
 
కాగా డేటా చోరీకి సంబంధించి ట్విట్టర్, మస్క్ అధికారికంగా స్పందించాల్సి వుంది. కాగా లాగిన్ క్రెడెన్షియల్స్ యాక్సెస్‌లో సమస్యలు.. ఖాతా సస్పెండ్ చేయబడిందని ఈ-మెయిల్ వస్తే ఫిషింగ్ ఎటాక్‌గా అనుమానించి... ఆ మెయిల్‌ను పరిశీలించడం చాలా అవసరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.