శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (10:45 IST)

వీవో నెక్స్‌పై కొత్త ఆఫర్.. రూ.13వేల వరకు తగ్గింపు

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ సంస్థ అయిన వీవో.. కొన్ని స్మార్ట్‌ఫోన్ మోడల్స్‌పై 8,000 ప్లస్ 5,000 మొత్తం రూ.13వేల వరకు ఆఫర్ ప్రకటించింది. వీవో గత జూలైన నెలలో నెక్స్ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దేశంలోనే తొలి ఇన్-డిస్‌ప్లే, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైన కొత్తలో రూ.47,990 ధర పలికింది. 
 
ప్రస్తుతం 8వేల రూపాయలను ఈ మోడల్‌కు తగ్గించడంతో రూ.39,990 ధరకు పలుకుబడి అయ్యింది. ఇంకా అమేజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి రూ.5వేల వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ప్రకటించింది.
 
వీవో నెక్స్ ఫీచర్ల సంగతికి వస్తే.. 
* 6.59 ఇంచ్ 2316x1080 పిక్సల్ ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED 19:3:9 డిస్‌ప్లే 
* 2.8 జిజాహెట్జ్ అక్టోకోర్ స్నాప్‌డ్రాగన్ 845 చిప్ సెట్, అడ్రినో 630 జీపీయూ 
* 8 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ 
* 12 ఎంబీ డ్యుయెల్ పీడీ ప్రైమరీ కెమెరా, డుయెల్ ఫోన్ ఎల్ఈడీ ఫ్లాష్, సోనీ IMX363 సెన్సార్, f/1.8 
* 5 ఎంబీ సెల్ఫీ కెమెరా,  f/2.0
* డ్యుయల్ సిమ్ స్లాట్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ 
* 4000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్.