గురువారం, 9 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By
Last Updated : బుధవారం, 2 జనవరి 2019 (15:07 IST)

సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టు.. బీసీసీఐ ప్రకటన.. అశ్విన్ డౌటే..

భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగనున్న సిడ్నీ టెస్టులో ఆడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే ఈ జట్టులో రవిచంద్రన్ అశ్విన్ చోటు దక్కడం అనుమానమేనని టాక్. గురువారం నుంచి సిడ్నీలో భారత్.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇందులో ఆడే 13 మంది సభ్యులతో కూడిన జట్టును భారత్ ప్రకటించింది. భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగే ఈ నాలుగు, చివరి టెస్టులో అశ్విన్ ఆడటం అనుమానంగా మారింది. 
 
 అశ్విన్ సిడ్నీ టెస్టులో ఆడుతాడా లేదా అనేది గురువారం ఉదయమే తెలుస్తోంది. ఉదర సంబంధిత రుగ్మతతో అశ్విన్ బాధపడుతున్నాడని.. చివరి టెస్టు ప్రారంభం లోపు ఆయన తేరుకుంటాడని టాక్. ఈ జట్టులో ఇషాంత్ శర్మకు బదులు ఉమేష్ యాదవ్‌కు స్థానం దక్కింది. కుల్ దీప్‌ యాదవ్ కూడా సిడ్నీ జట్టులో బరిలోకి దిగనున్నాడు. ఇక హిట్ మ్యాన్ రోహిత్ శర్మ.. ఆతని భార్య పండంటి పాపాయికి జన్మనివ్వడంతో భారత్‌కు కదిలి వెళ్లాడు. 
 
జట్టు వివరాలు.. 
విరాట్ కోహ్లీ (కెప్టెన్), రహానే (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, పుజారా, విహారి, పాంట్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, అశ్విన్, షమీ, జస్‌ప్రీత్ బూమ్రా, ఉమేష్ యాదవ్.