బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 1 ఏప్రియల్ 2020 (14:51 IST)

వీవో ఎస్ 6 5జీ ఫోన్: ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి అమ్మకాలు

Vivo S6 5G
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వీవో ఎస్ 6 5జీ ఫోనును విడుదల చేసింది. డుయల్ సిమ్‌తో వచ్చే ఈ ఫోనులో ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ వుంది. అమోలెడ్ స్క్రీన్, శక్తివంతమైన చిప్‌సెట్, అధిక సామర్థ్యం వున్న బ్యాటరీ, వెనుక భాగంలో నాలుగు కెమెరాలతో ఈ ఫోను విడుదలైంది. 4500 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 10డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. 
 
పొట్రైట్‌ షాట్స్‌ కోసం 2 ఎంపీ డెప్తి సెన్సార్‌ను వినియోగించారు. 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ ఉన్న మొబైల్‌ ధర రూ.28,678 కాగా,  8జీబీ ర్యామ్‌, 256 జీబీ ఉన్న మొబైల్‌ ధర రూ.31,860గా కంపెనీ నిర్ణయించింది. బ్లాక్‌, తెలుపు, నీలం రంగుల్లో ఈ ఫోన్‌ వినియోగదారులకు లభ్యం కానుంది. ఏప్రిల్‌ 4వ తేదీ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి.
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
48 మెగా పిక్సల్‌ కెమెరా
32 మెగా పిక్సల్‌ సెల్ఫీ కెమెరా
8 జీబీర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్
8 మెగాపిక్సల్‌ అల్ట్రావైడ్‌ షూటర్‌
2 మెగా పిక్సల్‌ మ్యాక్రో స్నాపర్‌.