వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్లు.. అవేంటో తెలుసా?

Written By ఠాగూర్
Updated: బుధవారం, 10 ఆగస్టు 2022 (13:20 IST)
సోషల్ మీడియా సాధనాల్లో ఒకటైన వాట్సాప్‌ను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు వీలుగా మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇందులోభాగంగా, సరితొత్త ఫీచర్లను త్వరలోనే ఇంప్లిమెంట్ చేయనున్నారు. ముఖ్యంగా, ఆన్‌లైన్‌లో ఉన్నట్టుగా కొందరికే కనిపించే, ఎవరికీ తెలియకుండా గ్రూపు నుంచి ఎగ్జిట్ కావడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 
 
పైగా, ఒకరికి పంపించిన మెసేజ్.. ఒక్కసారి చూడగానే దాన్ని డిలీట్ చేసుకునే వెసులుబాటు, వీటిని స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం లేకుండా సరికొత్త ఆప్షన్‌ను ప్రవేశపెట్టనుంది. అంతేకాకుండా, మనకు కావాలనుకున్నవారికి మాత్రమే ఆన్‌లైన్‌లో ఉన్నదీ లేనిదీ కనిపించేలా చేసుకునే సదుపాయాన్ని వాట్సాప్‌ అందుబాటులోకి తేనుంది. 
 
పలు వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడుగా ఉన్నప్పటికీ వాటి నుంచి ఎగ్జిట్ కావాలంటే కాస్తంత మొహమాటంగా ఉంటుంది. ఇపుడు సరికొత్త ఆప్షన్ ద్వారా గ్రూపుల్లో ఎలాంటి నోటిఫికేషన్ లేకుండా ఎగ్జిట్ అయ్యే సదుపాయాన్ని వాట్సాప్ తీసుకురానుంది. అయితే గ్రూపు అడ్మిన్లకు మాత్రం ఈ విషయం తెలుస్తుందని ఆ సంస్థ ప్రతినిధులు వివరించారు.
 
ఎవరికైనా ఏదైనా ఒకసారి చూసి డిలీట్ చేసేలా 'వ్యూ వన్స్' ఆప్షన్‌తో మెసేజీ పంపినప్పుడు వారు ఆ మెసేజీని చదవగానే డిలీట్ అయిపోయే సరికొత్త ఆప్షన్‌ను వాట్సాప్ ఇటీవలే అందుబాటులోకి తెచ్చింది. 
 
అయితే ఒకసారి చూసి డిలీట్ చేసే మెసేజీలనూ కొందరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుంటుండటం ఇబ్బందిగా మారుతోంది. ఈ క్రమంలో 'వ్యూ వన్స్' ఆప్షన్ కింద పంపిన మెసేజీలను స్క్రీన్ షాట్ తీసేందుకు వీలు లేకుండా లాకింగ్ సదుపాయాన్ని వాట్సాప్ తీసుకువస్తోంది.

అన్నీ చూడండి

విజయ్ నటించిన జననాయగన్‌ను తల్లితో కలిసి వీక్షించిన త్రిష

Romanchakam :సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం రాబోతోంది

Spider-Man: స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే ఫైనల్.. ట్రైలర్ విడుదల

Jana Nayakudu review :ఇద్దరు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ల కథతో జన నాయకుడు..రివ్యూ

ఆ ఒక్క కారణంతో బిగ్ బాస్ అవకాశాన్ని వదులుకున్నా : సత్యశ్రీ

తర్వాతి కథనం
Show comments