Redmi Note 11S అదిరిందిగా.. ప్రాసెసర్, కెమెరా లెన్సే ప్రధాన తేడాలు
రెడ్‌మీ నోట్ 11 సిరీస్ నుంచి రెండు మొబైళ్లు భారత్‌లో విడుదలయ్యాయి. రెడ్‌మీ నోట్ 11, రెడ్‌మీ నోట్ 11ఎస్ ఫోన్ల కోసం ఆత్రుత ఎదురుచూసిన స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి. వెనుక నాలుగు కెమెరాల సెటప్, 90 హెట్జ్ అమోలెడ్ డిస్‌ప్లే, 33వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టుతో ఈ మొబైళ్లు వచ్చాయి.
ప్రాసెసర్, కెమెరా లెన్స్ ఈ రెండు ఫోన్ల మధ్య ప్రధాన తేడాలుగా ఉన్నాయి. కాగా Redmi Note 11, Redmi Note 11S 4జీ కనెక్టివిటీతోనే వచ్చాయి.
రెడ్‌మీ నోట్ 11 మొబైల్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.13,499గా ఉంది. అలాగే 6జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ ధర రూ.14,499, 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజీ మోడల్ రేట్ రూ.15,999గా షియోమీ నిర్ణయించింది. హారిజన్ బ్లూ, స్పేస్ బ్లాక్, స్టార్ బర్స్ట్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లభ్యం కానుంది.