సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (18:04 IST)

Xiaomi 12 series:ప్రీ-ఆర్డర్స్ అదుర్స్

ఫోన్ల తయారీలో జియోమీ కంపెనీకి వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చైనాకు చెందిన ఈ కంపెనీ.. ఎంఐ, రెడ్‌మీ పేరుతో ఇప్పటి వరకు అత్యాధునికమైన ఫీచర్లలో పలు ఫోన్లను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది. త్వరలో జియోమీ నుంచి 12 సిరీస్ విడుదల కానుంది. 
 
ఈ సిరీస్‌లో భాగంగా జియోమీ 12, జియోమీ 12 ప్రో ఫోన్లు డిసెంబర్ 28న చైనాలో విడుదల కానున్నాయి. అయితే.. ఈ ఫోన్ల లాంచ్ కంటే ముందే.. ప్రీ ఆర్డర్స్ చేసుకునే అవకాశాన్ని జియోమీ కల్పించింది. దీంతో ఇప్పటి వరకు 2 లక్షలకు పైగా ఈ స్మార్ట్‌ఫోన్ల కోసం ప్రీ ఆర్డర్స్ వచ్చాయని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
 
పలు ఈ కామర్స్ వెబ్‌సైట్లలో ఈ ఫోన్ కోసం ముందే చాలామంది ప్రీ ఆర్డర్ చేసేశారట. 
 
ఫీచర్ల సంగతికి వస్తే.. 
2కే డిస్‌ప్లే, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నట్టు తెలుస్తోంది. 
అలాగే.. గేమింగ్ కోసం ప్రత్యేకంగా హీట్ డిస్సిపేషన్ అనే ఫీచర్‌ను ఈ ఫోన్లలో తీసుకురానున్నారు.