సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 21 డిశెంబరు 2021 (22:53 IST)

మేడ్ ఇన్ ఇండియా: భారత్‌లోనే యాపిల్ ఫోన్ల తయారీ

Apple
మేడ్ ఇన్ ఇండియా నినాదం ప్రస్తుతం యాపిల్ ఫోన్లకు కూడా వర్తించనుంది. యాపిల్ ఐ ఫోన్లు ఇక దేశంలోనే ఉత్పత్తి కానున్నాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలోని తన యూనిట్‌లో తైవానుకు చెందిన ఫాక్స్ కాన్ ప్రయోగాత్మకంగా ఐఫోన్13 మోడల్ తయారీని మొదలు పెట్టింది. దీంతో భారత్‌లో తయారీ దిశగా యాపిల్ అడుగులు వేసేలా చేయడంలో కేంద్రంలోని మోదీ సర్కారు కృషి ఫలించింది. 
 
భారత మార్కెట్ కోసమే కాకుండా.. ఎగుమతి మార్కెట్లకూ భారత్‌లో తయారీ వ్యూహాన్ని అనుసరించాలని యాపిల్ భావిస్తోంది. అందుకే ఈ ప్రయోగం మొదలెట్టింది. 
 
మరోవైపు దిగుమతి సుంకాలు పెంచడంతో దేశీయంగా ఐఫోన్ల ధరలు ప్రియం అయ్యాయి. అంతేగాకుండా భారత్‌లోనే తయారు చేస్తే రాయితీలు ఇస్తామని కేంద్ర సర్కారు ఆశ చూపించింది. దీంతో యాపిల్ అంగీకరించక తప్పలేదు.