మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 15 డిశెంబరు 2021 (23:04 IST)

యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్-ఐఫోన్ 12 ప్రో ధర తగ్గింపు

iPhone 12 Pro
యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్. యాపిల్ తాజాగా ఐఫోన్ ప్రో ధరను తగ్గించింది. ఐఫోన్ 12 ప్రో 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.99,990కు, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,07,990కు తగ్గింది. అంటే దీనిపై ఏకంగా రూ.42 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
 
ఐఫోన్ 12 తగ్గింపు ధరలతో అమెజాన్ ఇండియాలో మాత్రమే అందుబాటులో వుంటుంది.  ఐఫోన్ 12 ప్రో ప్రారంభ మోడల్ ధర రూ.1,14,900 నుంచి రూ.94,900కు తగ్గింది. 
 
పసిఫిక్ బ్లూ, గ్రాఫైట్, గోల్డ్, వైట్ రంగుల్లో ఐఫోన్ 12 ప్రో కొనుగోలు చేసే అవకాశం ఉంది. 128 జీబీ, 256 జీబీ, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో కూడా ఇది లభించనుంది.