పిల్లలకు బిస్కెట్లను పాలలో తడిపి ఇస్తున్నారా? (video)

సోమవారం, 18 మార్చి 2019 (14:17 IST)
పిల్లలకు బిస్కెట్లు అంటే చాలాఇష్టం. పెద్దలు కూడా స్నాక్స్‌గా అప్పుడప్పుడు బిస్కెట్లను తీసుకుంటూ వుంటారు. అయితే బిస్కెట్ల ద్వారా ఆరోగ్యానికి మేలు జరగదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. బిస్కెట్ల తయారీలో అధిక ఉష్ణోగ్రతలో నూనె, డాల్డా వంటివి వేడి అవుతాయి. అలా వేడైనప్పుడు ఆమ్లాలు పుట్టుకొస్తాయని ఆ సంఖ్య బిస్కెట్లలో ఎంతమాత్రం వుంటాయే లెక్కచేయలేమని వైద్యులు చెప్తున్నారు. 
 
ఈ ఆమ్లాలు శరీరంలో అధికంగా చేరడం ద్వారా కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి హృద్రోగ వ్యాధులకు కారణమవుతాయి. బిస్కెట్లు ఎక్కువ కాలం నిల్వ వుండేందుకు.. ఇంకా చెడిపోకుండా వుండేందుకు ఉప్పు అధికంగా చేర్చుతారు. ఇలాంటి బిస్కెట్లను తీసుకుంటే హైబీపీ తప్పదు. హైబీపీ వున్నవారు అధికంగా బిస్కెట్లను తీసుకోకపోవడం ఉత్తమం. ఎక్కువ కాలం నిల్వ వుంచేందుకు, రుచి కోసం ఉపయోగించే రసాయనాలు ఆరోగ్యానికి మంచివి కావని వైద్యులు చెప్తున్నారు. ఇంకా బిస్కెట్లు మృదువుగా వుండేందుకు గ్లూటన్ చేర్చడం జరుగుతోంది. 
 
ఇంకా పంచదార, సుక్రోస్, గ్లూకోజ్, ఈస్ట్, సోడియం వంటివి చేర్చడం జరుగుతోంది. సోడియం, చక్కెర అధికంగా వుండే బిస్కెట్లను తీసుకోవడం ద్వారా మధుమేహం, అధిక రక్తపోటు తప్పదు. ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోవడం కారణంగా ఒబిసిటీ ప్రమాదం పొంచి వుంటుంది. సోడియం కలిగిన బిస్కెట్లను తీసుకోవడం ద్వారా హైబీపీతో పాటు కిడ్నీ సమస్యలు, హృద్రోగ సమస్యలు ఏర్పడుతాయి. చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. బిస్కెట్లను అధికంగా తీసుకునే వారు బరువు కూడా సులభంగా పెరిగిపోతారని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 
 
ముఖ్యంగా పిల్లలకు తరచూ బిస్కెట్లను ఇవ్వడం చేయకూడదు. ఇలా చేస్తే పిల్లల్లో ఆకలి సామర్థ్యం తగ్గిపోతుంది. కొందరు పిల్లలకు పాలలో బిస్కెట్లను తడిపి ఇచ్చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. క్రీమ్ బిస్కెట్లను పాలలో కలిపి ఇవ్వడం అస్సలు చేయకూడదు. బిస్కెట్లు పాలు కలిపి పిల్లలకు ఇవ్వడం ద్వారా పిల్లల్లో అజీర్తి సమస్యలు ఉత్పన్నం అవుతాయి. 
 
ఇంకా ఉదయం, సాయంత్రం పూట పిల్లలకు బిస్కెట్లను ఇవ్వడం అలవాటు చేస్తే వారిలో అనారోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంకా స్నాక్స్‌ బాక్సుల్లో బిస్కెట్లను అస్సలు నింపకూడదు. బిస్కెట్లకు బదులు పండ్లను ఇవ్వడం చేస్తే పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు సూచిస్తున్నారు.
 

అన్నీ చూడండి

శుక్రవారం, జూలై 3, 2026 వాతావరణ నివేదిక ఎలా వుందంటే..?

బ్రిటీష్ మహిళ మెదడులో పరాన్నజీవులు - పదేళ్ళపాటు జీవితం నరకప్రాయం

నీట్ యూజీ రీ-ఎగ్జామ్ ప్రొవిజనల్ కీలపై 10 వేల అభ్యంతరాలు.. ఫలితాలు ఎపుడంటే?

డేకేర్‌లో చిన్నారులకు అమానుష శిక్షలు - నోట్లోకి టాయిలెట్ జెట్ స్ప్రేతో నీళ్లు

ఈవ్‌టీజింగ్ చేశాడని చెంపదెబ్బ.. అంతే అక్కాచెల్లెళ్లపై పదునైన ఆయుధాలతో దాడి

అన్నీ చూడండి

జి.వి. ప్రకాష్ కుమార్, కయదు లోహర్ ఇమ్మోర్టల్ నుంచి రాకాసి సాంగ్

Rajamouli: ఫ్రాన్స్‌లోని ఇన్‌స్టిట్యూట్ లూమియర్ వారి 'వాల్ ఆఫ్ ఫిల్మ్‌మేకర్స్'లో ఎస్.ఎస్. రాజమౌళి పేరు

జగపతి బాబు, లయ నటించిన వదలా చిత్రం రిలీజ్ కు సిద్ధం

Mythri Movie Makers: ధృవ్ విక్రమ్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ చిత్రం

VISA – వింటారా సరదాగా రెండో గీతం చింగారి కి స్పందన

తర్వాతి కథనం
Show comments