శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. బాలప్రపంచం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (12:09 IST)

పార్కుల పక్కన ఇల్లుంటే పిల్లలకు మేలే? ఎందుకో తెలుసా?

పార్కులున్న చోట నివాసముండేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. పార్కుల్లో జనాలు ఎక్కువ మంది ఉంటారని.. అందుకే పార్కుకు సమీపంలో ఇల్లుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు భావిస్తుంటారు. అయితే తాజా అధ్యయనం

పార్కులున్న చోట నివాసముండేందుకు ఎక్కువ మంది ఇష్టపడరు. పార్కుల్లో జనాలు ఎక్కువ మంది ఉంటారని.. అందుకే పార్కుకు సమీపంలో ఇల్లుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కొందరు భావిస్తుంటారు. అయితే తాజా అధ్యయనంలో తేలిందేమిటంటే? పార్కులు, పచ్చని వృక్షాలు గల ప్రాంతాలకు సమీపంలో నివాసముండటం ద్వారా పిల్లల్లో ఆస్తమాను దూరం చేసుకోవచ్చునని పరిశోధకులు నిరూపించారు. అమెరికాలోని జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడి అయ్యింది. 
 
పార్కులకు సమీపంలో నివాసముండే పిల్లల్లో ఆస్తమా లక్షణాలు తక్కువ శాతం నమోదు కాగా.. పార్కులకు దూరంగా వుండే పిల్లల్లో ఆస్తమా లక్షణాలు త్వరలోనే తొంగిచూస్తున్నాయని పరిశోధకులు తేల్చారు. అంతేగాకుండా పచ్చని వృక్షాలకు సమీపంలో నివాసం ఉండటం ద్వారా చిన్నారుల్లో ఆస్తమాను బాగా తగ్గుతుందని కూడా పరిశోధకులు తెలిపారు. తద్వారా వాయు కాలుష్యం వుండదని, నగర జీవితంలో పిల్లల్లో అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువేనని వారు వెల్లడించారు.